జయప్రద: సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: 'ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్' జయప్రదను రాజకీయాల్లోకి ఆహ్వానించినదెవరు

  • 16 ఏప్రిల్ 2019

తెలుగు సినీరంగాన్ని కొన్నేళ్ల పాటు ఏలిన కథానాయకి జయప్రద.

అక్కడి నుంచి ఆమె ప్రయాణం బాలీవుడ్‌కు మారింది. అక్కడా విజయాలే.

తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ.. భాష ఏదైనా అక్కడి వెండితెరలకు జయప్రద మరింత అందం తెచ్చిన కథానాయికే.

భారతదేశంలోని అగ్ర కథానాయకులందరితోనూ నటించిన ఘనత ఆమెది.

ఎన్టీఆర్, రాజ్‌కుమార్, అమితాబ్, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి నుంచి మొదలుకుని బాలీవుడ్ తరువాత తరం అక్షయ్ కుమార్ వంటివారితో కూడా నటించారామె.

'ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్' అని సత్యజిత్ రే నుంచి ప్రశంసలు అందుకున్న నటి ఆమె.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)