బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై బూటుతో దాడి

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై బూటుతో దాడి

దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలంయలో గురువారం నాడు మీడియా సమావేశం జరుగుతున్నప్పుడు ఆ పార్టీ జాతీయ ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఒక వ్యక్తి బూటు విసిరేశాడు.

ఆ బూటు దెబ్బ నుంచి ఆయన తృటిలో తప్పించుకోగలిగారు.

ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన భోపాల్ నియోజకవర్గం నుంచి సాధ్వి ప్రజ్ఞను బరిలోకి దించే విషయమై మాట్లాడుతూ, హిందువులను అప్రతిష్ఠపాలు చేస్తున్నారంటూ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు.

తన మీద బూటుతో దాడి చేయడం "కాంగ్రెస్ ప్రేరేపిత చర్య. దీన్ని అందరూ ఖండించాలి" అని జీవీఎల్ అన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

"కాంగ్రెస్ ప్రేరేపిత వ్యక్తి మరోసారి ఆ పార్టీ మానసిక స్థితి ఎలా ఉందో చూపించారు. ఇలాంటి నేరగాళ్ళను చూసి మేమేమీ బెదరిపోం. ఈ చర్యను మేం ఖండిస్తున్నాం" అని జీవీఎల్ అని అన్నారు.

సంఘటన జరిగినప్పుడు బీజీపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు.

బూటు విసిరిన వ్యక్తిని వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అందుపులోకి తీసుకుని మీడియా రూం నుంచి బయటకు తీసుకువెళ్ళారు. అ తరువాత ప్రెస్ మీట్‌ను రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)