పొరపాటున వేరే పార్టీకి ఓటేసి వేలు కోసుకున్న యువకుడు

పవన్ కుమార్

ఫొటో సోర్స్, yogeshkumarsing

ఒక పార్టీకి ఓటు వేయాలనుకుని పొరపాటున మరో పార్టీకి ఓటు వేసినందుకు తనను తాను శిక్షించుకున్నాడు ఓ యువకుడు.

ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌కు చెందిన పవన్ కుమార్ ఏప్రిల్ 18న జరిగిన రెండో దశ పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అయితే, ఈవీఎంపై ఉన్న రకరకాల గుర్తులు చూసి కన్ఫ్యూజ్ అయి అనుకోకుండా కమలం గుర్తు(బీజేపీ) నొక్కేశారు.

తాను కోరుకున్న పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేశానన్న బాధతో ఆయన తన వేలిని కోసుకున్నారు.

ఈ విషయం చెబుతూ సోషల్ మీడియాలో ఆయన వీడియో పోస్ట్ చేయగా అదిప్పుడు వైరల్‌గా మారింది.

''నేను ఏనుగు గుర్తు(బీఎస్పీ)కు ఓటేయాలనుకుని వెళ్లాను. కానీ, పొరపాటున ఈవీఎంలో కమలం గుర్తుపై నొక్కాను'' అంటూ ఆయన ఆ వీడియోలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)