ఐపీఎల్ 2019: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 9 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
డేవిడ్ వార్నర్
ఐపీఎల్ 2019లో సన్ రైజర్స్ ఐదో విజయం అందుకుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ ఓపెనర్లు మరోసారి భారీ స్కోర్లు చేయడంతో సన్ రైజర్స్, నైట్ రైడర్స్‌పై అవలీలగా గెలిచింది.
డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 67 పరుగులు చేసి పృథ్వీరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయినా, బెయిర్‌స్టో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ మిగతా లాంఛనం పూర్తి చేశారు.
బెయిర్‌స్టో 43 బంతుల్లో 80 పరుగులు, విలియమ్సన్ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
వార్నర్, బెయిర్‌స్టో మెరుపులతో 15 ఓవర్లలోనే హైదరాబాద్ విజయం అందుకుంది.
బంతులు, వికెట్ల విషయంలో చూస్తే ఇది హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో రెండో అతిపెద్ద విజయం.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది వరసగా ఐదో పరాజయం.
అంతకు ముందు టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆండ్రీ రస్సెల్ ఫైల్ ఫొటో
15 పరుగులే చేసిన రస్సెల్
కోల్‌కతా నైట్ రైడర్స్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంచినా మూడో ఓవర్లో నాలుగో బంతికి ఓపెనర్ నరైన్(25) వికెట్ కోల్పోయింది.
నరైన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. తర్వాత వరసగా కోల్‌కతా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
ఐదో ఓవర్ రెండో బంతికి శుభమన్ గిల్ 3 పరుగులే చేసి ఖలీల్ మహ్మద్ బౌలింగ్ లోనే విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
8వ ఓవర్ మొదటి బంతికి నైట్ రైడర్స్ నితీష్ రాణా వికెట్ కోల్పోయింది.
11 పరుగులు చేసిన రాణా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు.
తర్వాత తొమ్మిదో ఓవర్లో నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా అవుటయ్యాడు. 6 పరుగులు చేసిన అతడిని విజయ్ శంకర్ రనౌట్ చేశాడు.
10 ఓవర్లకు కోల్ కతా 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది.
తర్వాత వచ్చిన రింకూసింగ్ 30 పరుగులకు సందీప్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత ఓవర్‌కే నిలకడగా ఆడుతున్న ఓపెనర్ క్రిస్ లిన్(51) కూడా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
చివరి ఓవర్లలో రెచ్చిపోయే ఆండ్రీ రసెల్ రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత(15) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటవడం కోల్‌కతాకు షాకిచ్చింది.
తర్వాత వచ్చిన పీయూష్ చావ్లా 4 పరుగులు చేసి అవుటవగా, పృథ్వీరాజ్(0), కేసీ కరియప్ప(9) నాటౌట్‌గా నిలిచారు.
జట్టులో క్రిస్ లిన్, రింకూ సింగ్ మాత్రమే రాణించారు. రసెల్ వైఫల్యంతో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్‌కు 3, భువనేశ్వర్ కుమార్‌కు 2, సందీప్ శర్మ, రషీద్ ఖాన్‌కు చెరో వికెట్ లభించాయి.
ఇవి కూడా చదవండి:
- మొన్న రసెల్.. నిన్న గేల్.. ‘యూనివర్స్ బాస్’ ఆట చూశారా
- ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ విజయవంతమా కాదా: రియాలిటీ చెక్
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- రియాలిటీ చెక్: బుల్లెట్ రైలు గడువులోగా పట్టాలెక్కుతుందా?
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?
- గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యే వాడుతున్నారెందుకు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)