ఈవీఎం వీవీ ప్యాట్‌ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది.. బెంబేలెత్తిన ఓటర్లు

పాము

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పాము.. సింబాలిక్ ఇమేజ్

లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఈవీఎం వీవీ ప్యాట్‌లో పాము కనిపించింది.

కేరళలోని కన్నూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మయ్యిల్ కందక్కాయ్ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన వీవీప్యాట్‌లో పాము కనిపించింది.

ఈ హఠాత్పరిణామంతో ఓటర్లు బెంబేలెత్తిపోయారు. పోలింగ్‌ కొద్దిసేపు ఆగిపోయింది.

చివరకు పాములు పట్టేవాళ్లను రప్పించి ఆ పామును బయటకు రప్పించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆ తరువాతే పోలింగ్ మళ్లీ మొదలైంది. వీవీ ప్యాట్‌లోకి పాము ఎలా వచ్చిందన్న విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.

కన్నూర్ లోక్‌సభ స్థానంలో ఎల్డీఎఫ్ అభ్యర్థిగా సీపీఎం నేత, సిటింగ్ ఎంపీ పీకే శ్రీమతి పోటీ చేస్తుండగా, యూడీఎఫ్ నుంచి కాంగ్రెస్ నాయకుడు సురేంద్రన్, బీజేపీ నుంచి సీకే పద్మనాభన్ బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)