కియా ఫ్యాక్టరీ అనంత తలరాత మారుస్తుందా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: కియా ఫ్యాక్టరీ అనంత తలరాత మారుస్తుందా?

  • 25 ఏప్రిల్ 2019

ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక నగరాలు, ప్రభుత్వ భూసేకరణ ద్వారా ఏర్పడిన భారీ పరిశ్రమలు - వాటి సామాజిక ఆర్థిక ప్రభావంపై పరిశీలనలో భాగంగా అనంతపురంలో కియా పరిశ్రమకు, ఆ చుట్టుపక్కల పల్లెలకు బీబీసీ వెళ్లింది.

కియా పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన కియా 535 ఎకరాల్లో ఒక ప్లాంటును నిర్మిస్తోంది. ప్రధాన పరిశ్రమతో పాటు మరో 16 అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్లాంటు చుట్టుపక్కల నిర్మించబోతున్నారు.

ఈ ఫ్యాక్టరీతో పెనుగొండ పట్టణం, పరిసర గ్రామాలు చాలా మారాయి. ఉద్యోగుల రాకతో ఇళ్ల అద్దెలు పెరిగాయి. కొత్తగా భవనాలు, దుకాణాలు వెలిశాయి. కొరియన్ రెస్టారెంట్లు, కొరియా భాషలో కనిపించే బోర్డులతో ఈ ప్రాంతం కొత్తదనం సంతరించుకుంది.

ఉపాధి

ఉపాధి - ఉద్యోగాల విషయంలో స్థానికుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ప్రస్తుతానికి కియాలో 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి మొత్తం 3,500 మంది ఉద్యోగులను కియా సంస్థ నియమించనుంది. మొత్తం 16 అనుబంధ సంస్థల్లో కలిపి మరో 6,500 మందికి ఉపాధి దొరుకుతుందని కియా చెబుతోంది.

ఈ ప్రాంతంలో డిగ్రీలు, ఇంజినీరింగ్ చదివిన వారు ఎక్కువ. కానీ కియా మాత్రం డిప్లొమా వారికే ప్రాధాన్యత ఇస్తోంది. కియాలో ఉన్నత ఉద్యోగాల్లో కొరియన్లు ఉంటారు. మిగిలిన ఉద్యోగాల్లో 80 శాతానికిపైగా తమిళులే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

''భూమి పోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంకా పని పూర్తి కాలేదు అని చెబుతున్నారు. మన వాళ్లు డిగ్రీలు చదివారు. వాళ్లకు పాలిటెక్నిక్ కావాలి. ఇక్కడ కూడా అంతా చదువుకున్న వాళ్ళే. ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తే ఫ్యాక్టరీలో చేయగలుగుతారు. అదేం పెద్ద సమస్య కాదు. మాకు టాలెంట్ ఉంది. శిక్షణ ఇస్తే నేర్చుకుంటాం. తమిళ వాళ్లకు పనిలో అనుభవం ఉందని వారిని తీసుకుంటున్నారు. మాకు ఉద్యోగాలిస్తారని ఆశిస్తున్నాం'' అన్నారు ఆంజనేయులు.

కియా పరిశ్రమ గురించి మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)