తెగిపోయిన చేతిని సంచిలో వేసుకుని హాస్పిటల్‌కు వెళ్లాడు.. ఇప్పుడా చేయి పనిచేస్తోంది

  • 30 ఏప్రిల్ 2019
రైలు ప్రయాణం Image copyright Getty Images

ముంబయికి చెందిన చయాంక్ కుమార్ గతేడాది ఏప్రిల్ 10న కాలేజ్‌కు వెళుతున్నారు. లోకల్ ట్రెయిన్ చాలా రద్దీగా ఉంది. రైలు ఎక్కబోయిన చయాంక్ ప్రమాదవశాత్తూ రైలు కింద పడ్డారు. రైలు కదిలింది. స్పృహ కోల్పోయిన చయాంక్, కళ్లు తెరిచేపాటికి, తన చేయి తెగిపడి కనిపించింది.

‘‘ఆరోజు ఉదయం చాలా రద్దీగా ఉంది. రైలు ఎక్కబోయి జారిపోయాను. రెండు బోగీల మధ్య జారి, ట్రాక్‌పై పడ్డాను. నా తల పట్టాలపై ఉంది. రైలు చక్రం నావైపు రావడం కనిపించింది. వెంటనే పక్కకు జరిగాను. తర్వాత ఏం జరిగిందో నాకు సరిగా గుర్తు లేదు. రైలు నన్ను ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లింది. కళ్లు తెరిచి చూస్తే, చేయి నానుండి వేరుపడింది’’ అని చయాంక్ అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: తెగిపడిన చేతిని అతికించారు

విడిపోయిన చేతిని వైద్యులు తిరిగి అతికించారు. ప్రస్తుతం చయాంక్ వైద్యం చేయించుకుంటూనే ఉన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో ఏదైనా సాధించాలని చయాంక్ భావిస్తున్నారు.

మరింత సమాచారాన్ని పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు