జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ వాడితే పిల్లలకు క్యాన్సర్ వస్తుందా?

  • 2 మే 2019
శిశువు Image copyright Getty Images

మీ పిల్లలకు ఏ షాంపూ వాడతారు? ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ షాంపూ వాడుతుండవచ్చు. అయితే, భారత్‌లో ఎక్కువగా వినిపించే పిల్లల షాంపూ పేరు ‘జాన్సన్ అండ్ జాన్సన్’. గత కొద్ది కాలంగా ఈ షాంపూ వివాదంలో చిక్కుకుంది. ఈ షాంపూ వాడితే పిల్లలకు క్యాన్సర్ వస్తుందని భారత ప్రభుత్వ పరీక్షల్లో తేలింది.

రాజస్థాన్‌లోని ఓ లేబొరేటరీలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకు చెందిన షాంపూ, పౌడర్లపై కొన్ని పరీక్షలు చేశారు. షాంపూలో క్యాన్సర్ కారక ఫార్మాల్డిహైడ్ ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ, ఈ కంపెనీకి చెందిన పౌడర్‌లో హానికరమైనదేదీ బయటపడలేదు.

శాస్త్రవేత్తల నివేదిక అందాక, ఈ షాంపూ అమ్మకాలు ఆపాలని, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సిపిసిఆర్) రాష్ట్ర కార్యదర్శులకు లేఖలు రాసింది. కానీ ఈ ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఖండించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: మీ పిల్లలకు ఏ షాంపూ వాడుతున్నారు?

తమ షాంపూ హానికారకం కాదని ప్రకటించింది. ఫార్మాల్డిహైడ్ ప్రమాదకర రసాయనం. దీనివల్ల క్యాన్సర్ రావచ్చు.

ఫార్మాల్డిహైడ్ వల్ల, ముక్కు, గొంతు, కళ్లలో మంటలు, తలతిరగటం లాంటివి కలుగుతాయి. డెర్మటాలజిస్టులు కూడా ఇది హానికర రసాయనమని చెబుతున్నారు. ఈ షాంపూలో ఫార్మాల్డిహైడ్ వల్ల క్యాన్సర్ వస్తుందని వారు చెబుతున్నారు.

మీ పిల్లల కోసం షాంపూ కొనేటపుడు జాగ్రత్తగా ఆలోచించండి. మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు