ఇతడు తన పీడకలలకు రూపం ఇచ్చిన అరుదైన కళాకారుడు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: పీడకలలకు రూపం ఇచ్చే అరుదైన కళాకారుడు

  • 9 మే 2019

నికోలస్ బ్రునో అనే ఒక కళాకారుడు ఏడేళ్ల వయసు నుంచే 'స్లీప్ పెరాలసిస్‌'తో బాధపడుతున్నారు. తను ఉన్న పరిస్థితిలో వచ్చే భయంకరమైన పీడకలల గురించి చెప్పడానికి ఆయన ఫొటోగ్రఫీని మార్గంగా ఎంచుకున్నారు.

ఆయన చేసిన ఆ ప్రయోగం తనకు వచ్చిన కలలను విశ్లేషించి వాటి అర్థం తెలుసుకోడానికి ఉపయోగపడింది.

మనం కలల నుంచి మేలుకున్నప్పుడు కలిగే అనుభూతి స్లీప్ పెరాలసిస్(నిద్రలో పక్షవాతం)

అప్పుడు మన శరీరం నిద్రపోతూనే ఉంటుంది. కానీ మనం మెలుకువలోనే కలలు కంటుంటాం.

మనం ఎందుకు కదలలేకపోతున్నామా అనే సందేహం వస్తుంది. అప్పుడే కలలు కనడం మొదలవుతుంది.

ఆ కలల్లో చాలా భయంకరమైన ఆకారాలు మన గదిలో తిరుగుతుంటాయి. ఇలాంటి జరుగుతాయని మనం ఎప్పుడూ అనుకోనివి మనకు తెలుస్తుంటాయి.

ఆరేళ్ల వయసులో తనకు తొలిసారి స్లీప్ పెరాలసిస్ వచ్చినట్లు గుర్తుందని నికోలస్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)