మమతా బెనర్జీ పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేశారనే ప్రచారంలో నిజమెంత?: Fact Check

  • 10 మే 2019
స్థానిక న్యూస్ చానెల్‌లో ప్రసారం చేసిన కథనం Image copyright News Britan

పశ్చిమ బంగా పోలీసులు ఎన్నికల రోజున కేంద్ర భద్రతా బలగాలను కొడుతున్నారని ఒక గ్రాఫిక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై ''మమతా బేగం పోలీసులు చివరకు కేంద్ర భద్రతా దళాలను కూడా విడిచిపెట్టడం లేదు. ఈ వీడియోను షేర్ చేయండి. ఎన్నికల సంఘానికి పంపండి'' అని రాసి ఉంది.

ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ వీడియోను వేలాది మంది చూసి షేర్ చేశారు.

రోహింజ్యా శరణార్థులు పశ్చిమ బంగాలో భద్రతా దళాలపై దాడులకు దిగుతున్నారని ఇదే వీడియో చూపెడుతూ షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ వీడియోను వారు వక్రీకరిస్తున్నారని మా పరిశీలనలో తేలింది. ఈ వీడియోలో ఆగ్రహంతో ఉన్న ఓ మూక అధికారుల వాహనాలపై దాడి చేస్తోంది.

ధ్వంసమైన వాహనంలో కూర్చొన్నవారు నీలి రంగు చొక్కాలు వేసుకున్నట్లు ఈ వీడియోలో గమనించవచ్చు.

Image copyright ugc

ఈ వీడియో వెనుకున్న వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ప్రయత్నించగా News Britant అనే స్థానిక న్యూస్ చానెల్ ఈ వీడియో కథనాన్ని ప్రసారం చేసినట్లు తేలింది.

12 ఏప్రిల్ 2019లో ప్రసారమైన ఈ కథనంలో జాతీయ రహదారి 31 పై జరిగిన ప్రమాదంలో జల్పాయిగురిలోని రాజ్‌గంగ్ చౌక్ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్థానికులు చనిపోయారని పేర్కొన్నారు.

ప్రమాద సంఘటన తెలియగానే రాజ్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు బృందం ఘటనా స్థలానికి కాస్త ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పోలీసులు వాహనాలపై దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసులుకు, స్వచ్ఛంద కార్యకర్తలకు గాయాలయ్యాయి.

పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆందోళకారుల నుంచి తప్పించుకునేందుకు దగ్గర్లోని నివాస గృహాల్లో దాచుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను అక్కడికి పంపించారు.

Image copyright newsbritant

బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం జల్పాయిగురి ఎస్పీ అమితాభ మైఠీతో మాట్లాడింది.

ఆయన ఈ ఘటన గురించి బీబీసీకి వివరిస్తూ, '' బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మేం వెళ్లగా ఆగ్రహంతో ఒక మూక మా వాహనాలను ధ్వంసం చేశాయి. మాపై రాళ్లదాడి చేయడం మొదలు పెట్టాయి. పోలీసులు, స్వచ్ఛంధ కార్యకర్తలు గాయపడ్డారు. ఆగ్రహంతో దాడి చేస్తున్నవారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు'' అని తెలిపారు.

''కేంద్ర భద్రతా బలగాలపై మమతా బెనర్జీ పోలీసులు దాడి చేస్తున్నారని, రోహింజ్యా లు దాడి చేస్తున్నారని అనడం అబద్ధం'' అని వివరించారు.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు

కర్ణాటక ముఖ్యమంత్రి: అడ్వాణీకి వర్తించిన రూల్ యడ్యూరప్పకు వర్తించదా

'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం

పదహారేళ్ల కిందటే చంద్రుడిపై స్థలం కొన్నానంటున్న హైదరాబాద్ వ్యాపారి.. అసలు చందమామపై స్థలం కొనొచ్చా

కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్