గువాహటిలో గ్రెనేడ్ పేలుడు, ఆరుగురికి గాయాలు

  • 15 మే 2019
గువాహటిలో గ్రెనేడ్ పేలుడు Image copyright ANI
చిత్రం శీర్షిక గువాహటిలో గ్రెనేడ్ పేలుడు

అసోంలోని గువాహటిలో కొద్దిసేపటి క్రితం ఓ గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు గాయపడ్డారు.

జూ రోడ్‌లోని ఓ షాపింగ్ మాల్‌ బయట ఈ పేలుడు చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

గాయపడినవారిని గువాహటి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు.

ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విటర్‌లో తెలిపింది.

రాత్రి 8 గంటలకు గ్రెనేడ్ పేలుడు జరిగినట్లు గువాహటి పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్ తెలిపారు.

ఈ పేలుడులో ఆరుగురు గాయపడ్డారని, ఘటనపై విచారణ ప్రారంభించామని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు