ఇల్మా అఫ్రోజ్, ఐపీఎస్ ఆఫీసర్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇల్మా అఫ్రోజ్, ఐ.పీ.ఎస్: సమాజాన్ని ఎదిరించి... అనుకున్నది సాధించిన యూపీ యువతి

  • 20 మే 2019

ఆమె 14 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. ఆడపిల్ల చదువు చెప్పించి నెత్తికెక్కించుకుంటారా అంటూ సమాజం సూటిపోటి మాటలంటున్నా ఆమె తన తల్లి అండతో అనుకున్నది సాధించారు. ఐపీఎస్ కావాలన్న కలను నిజం చేసుకున్నారు.

మొరాదాబాద్ జిల్లా కుందరికీ గ్రామంలో పుట్టిన ఇల్మా అఫ్రోజ్ కథ ఎవరికైనా స్ఫూర్తినిస్తుంది.

బాల్యం నుంచీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న ఇల్మా తనకు పదేళ్లప్పుడు తండ్రికి క్యాన్సర్ వచ్చిందని, ఆ తర్వాత చనిపోయారని, తల్లే తనను కష్టపడి చదివించారని చెబుతారు.

చదువుకుంటున్న సమయంలో చుట్టుపక్కల వారు, బంధువులు చాలా మంది తల్లితో "అమ్మాయికి పెళ్లి చేసి పంపించెయ్, ఎప్పటికైనా పరాయి సొత్తే కదా. ఇంత చదివి ఏం చేయాలి" అనేవారని ఇల్మా బీబీసీతో చెప్పారు.

"ఇప్పుడు వాళ్లే మా ఇంటికి తమ పిల్లల్ని తీసుకొస్తున్నారు. వీళ్లను కూడా మీలాగే ఐపీఎస్ చేయండి అని మమ్మల్ని అడుగుతున్నారు" అంటారు అఫ్రజో.

కూతురు బాగా చదివి ఏదో సాధిస్తుందని ఆశపడ్డ ఆ తల్లి ఆశలు వమ్ము కాలేదు. స్కాలర్‌షిప్ ద్వారా దిల్లీ, ప్యారిస్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువు పూర్తి చేసిన ఇల్మా, ఇండోనేసియాలో ఐక్యరాజ్యసమితి కోసం కూడా పనిచేశారు.

సమాజం బయట ఉండి లోపాలు వెతిక్కుండా తల్లి తనకు కష్టపడి పని చేయడం నేర్పించిదని చెబుతారు ఇల్మా. ఉన్నత చదువులు చదివిన ఇల్మా. కానీ ఆమె మనసులో దేశం కోసం ఏమైనా చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది.

దాంతో భారత్ వచ్చిన తర్వాత యూపీఎస్సీ పరీక్షలు రాసిన ఇల్మా ఐపీఎస్ అయ్యారు. సమాజంలో బలహీనులకు అండగా నిలవాలనే అది ఎంచుకున్నానని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)