కేదార్‌నాథ్ గుహలో మోదీ ధ్యానం: కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసిన మొదటి ప్రధాని అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు

  • 18 మే 2019
మోదీ ధ్యానం Image copyright @BJP4India/Twitter
చిత్రం శీర్షిక కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేసిన మోదీ

ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడున్న గుహలో ధ్యానానికి కూర్చున్నారు.

సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ ఫొటోలపై మోదీ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తుంటే, వ్యతిరేకులు మాత్రం కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసే మొదటి ప్రధాని మోదీయే అంటూ ఛలోక్తులు విసిరారు.

"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేసి కేదార్‌నాథ్‌లోని ఓ గుహకు చేరుకున్నారు. వెంట వెళ్లిన మీడియా విజ్ఞప్తి మేరకు గుహలో ధ్యానం చేసుకుంటున్న ఫొటోలను తీసుకోవడానికి ఆయన అనుమతించారు. ఈ ధ్యానం రేపు ఉదయం వరకూ కొనసాగుతుంది. ఆ గుహ సమీపంలోకి మీడియా గానీ, ఇతర వ్యక్తులను గానీ అనుమతించరు అని తెలిసింది" అని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

అయితే ప్రధాని ఫొటోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. విమర్శలు, ప్రతి విమర్శల ట్వీట్లతో హోరెత్తిపోయింది.

Image copyright Twitter

"మీడియా కోరినవన్నీ చేస్తున్నారు ప్రధాని, బాగుంది" అని సీనియర్ జర్నలిస్టు సుహాసినీ హైదర్ ట్వీట్ చేశారు.

Image copyright Twitter

"మోదీ జీ, శివుడికి ఎలాంటి సూట్లూ లేవు. మీలాగా ఆయన ధనవంతుడు కాదు. ఆయన రాజకీయాలు కూడా చేయడు. మీ సూట్లలో ఒకటి ఆయనకు ఇవ్వండి. మీకు 10 లక్షల విలువైన సూట్లు చాలా ఉన్నాయి కదా" అని సంఘమిత్ర పేరుతో ఉన్న ఓ ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

Image copyright Twitter

ఆయన ఆధునిక దుస్తులు ధరించిన ఓ రుషి అని మరో యూజర్ ట్వీట్ చేశారు.

Image copyright Twitter

కెమెరా తీసుకెళ్లి ధ్యానం చేసే మొదటి ప్రధాని మోదీ అని మొహమ్మద్ అనాస్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.

Image copyright Twitter

నిన్న జరిగిన మీడియా సమావేశంలో మీడియా విజ్ఞప్తి చేసినా ఎందుకు తిరస్కరించారు, ఆయన ఎందుకు మాట్లాడలేదు? అని మమతా జగ్గి ట్వీట్ చేశారు.

Image copyright TWITTER

మీడియా విజ్ఞప్తి చేస్తున్న రఫేల్, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలపై ప్రధాని మోదీ ఎప్పుడు మాట్లాడతారు మరి అని డాక్టర్ వత్స అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

Image copyright TWITTER

"ఈ ఫొటోలన్నీ అసలైన నాటకానికి రిహార్సల్స్ అనుకోవాలా.. బాగా చేశారు, చట్టాలను, నిబంధనలను ఎవరికీ దొరక్కుండా ఎలా అతిక్రమించాలనే దానిపై నరేంద్ర మోదీ ఓ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించాలి. ఇది కూడా వారి ప్రచారంలో భాగమే" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)