సైబీరియన్ పక్షులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చింతపల్లిలో సైబీరియన్ కొంగలు: ఐదు వేల కిలోమీటర్ల నుంచి వచ్చే ప్రత్యేక అతిథులు

  • 19 మే 2019

తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి ఏటా ఐదు వేల కిలోమీటర్ల దూరం నుంచి సైబీరియన్ పక్షులు వలస వస్తాయి. వీటిని గ్రామస్థులు బంధువుల్లా చూస్తారు. ఒంటరిగా వచ్చే ఈ పక్షులు గుడ్లు పెట్టి పిల్లలతోపాటే తిరిగి సైబీరియా వెళ్లిపోతాయని గ్రామస్థులు చెబుతున్నారు. వారు ఈ పక్షులను ఎర్రబోలు కొంగలుగా పిలుస్తారు.

ఒక గూడులో జంట పక్షులుంటాయని, గుడ్లు పెట్టి పిల్లలను చేసిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయని వారు వివరిస్తున్నారు.

"నీళ్లు గొంతు వరకు నింపుకొని పిల్ల పక్షులకు అందించేందుకు మళ్లీ మొత్తం నీరు బయటకు తీసి ఇవ్వడం మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. అందరికీ అవి సైబీరియన్ కొంగలు, మాకు మాత్రం ఎర్రబోలు కొంగలే" అని కొట్టె తిరుపతి అనే గ్రామస్థుడు బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)