ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కొత్త వారసుల్లో బోణీ చేసింది వీరే

  • 24 మే 2019
పరిటాల శ్రీరాం Image copyright facebook/paritala sriram
చిత్రం శీర్షిక పరిటాల శ్రీరాం

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పెద్దసంఖ్యలో రాజకీయ వారసులు తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో దిగారు. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగారు.

కొందరు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తమ బంధువులను పోటీకి నిలపగా.. మరికొందరు మాత్రం తాము పోటీలో ఉంటుండగానే సంతానాన్నీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకొచ్చారు.

Image copyright facebook/magantiroopa
చిత్రం శీర్షిక మాగంటి రూప

అయితే, వారసులుగా బరిలోకి దిగిన వారిలో అధిక శాతం ఓడిపోయారు. ఆ వివరాలు..

క్రమ సంఖ్య అభ్యర్థి బంధుత్వం పార్టీ నియోజకవర్గం ఫలితం
1 నారా లోకేష్ చంద్రబాబు కుమారుడు టీడీపీ మంగళగిరి ఓటమి
2 గౌతు శిరీష గౌతు శివాజీ కూమార్తె టీడీపీ పలాస ఓటమి
3 అదితి గజపతి రాజు అశోక్ గజపతిరాజు కుమార్తె టీడీపీ విజయనగరం ఓటమి
4 కిమిడి నాగార్జున కిమిడి మృణాళిని కుమారుడు టీడీపీ చీపురుపల్లి ఓటమి
5 కిడారి శ్రవణ్‌కుమార్ కిడారి సర్వేశ్వరరావు కుమారుడు టీడీపీ అరకు ఓటమి
6 ఆదిరెడ్డి భవాని ఎర్రన్నాయుడు కుమార్తె టీడీపీ రాజమండ్రి సిటీ విజయం
7 తోట వాణి తోట నరసింహం సతీమణి వైసీపీ పెద్దాపురం ఓటమి
8 జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు వైసీపీ రాజానగరం విజయం
9 దేవినేని అవినాశ్‌ దేవనేని నెహ్రూ తనయుడు టీడీపీ గుడివాడ ఓటమి
10 కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ కాగిత వెంకటరావు తనయుడు టీడీపీ పెడన ఓటమి
11 వసంత కృష్ణప్రసాద్ వసంత నాగేశ్వరరావు కుమారుడు వైసీపీ మైలవరం విజయం
12 షబానా ఖాతూన్ జలీల్ ఖాన్ టీడీపీ విజయవాడ పశ్చిమ ఓటమి
13 కాసు మహేశ్ రెడ్డి కాసు కృష్ణారెడ్డి తనయుడు వైసీపీ గురజాల విజయం
14 గాలి భానుప్రకాశ్ ముద్దుకృష్ణమ నాయుడి కుమారుడు టీడీపీ నగరి ఓటమి
15 హరికృష్ణ కుతూహలమ్మ తనయుడు టీడీపీ గంగాధర నెల్లూరు ఓటమి
16 బొజ్జల సుధీర్ రెడ్డి బొజ్జల గోపాలరెడ్డి కుమారుడు టీడీపీ శ్రీకాళహస్తి ఓటమి
17 పంతంగాని నర్సింహప్రసాద్ శివప్రసాద్ అల్లుడు టీడీపీ రైల్వేకోడూరు ఓటమి
18 టీజీ భరత్ టీజీ వెంకటేశ్ కుమారుడు టీడీపీ కర్నూలు ఓటమి
19 కేఈ శ్యాంబాబు కేఈ కృష్ణమూర్తి తనయుడు టీడీపీ పత్తికొండ ఓటమి
20 గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి గంగుల ప్రతాపరెడ్డి కుమారుడు వైసీపీ ఆళ్లగడ్డ విజయం
21 శిల్పా రవిచంద్రారెడ్డి శిల్పా మోహనరెడ్డి తనయుడు వైసీపీ నంద్యాల విజయం
22 అరవింద్ రాణి ఎస్పీవై రెడ్డి కుమార్తె జనసేన బనగానపల్లె ఓటమి
23 సుజల ఎస్పీవై రెడ్డి కుమార్తె జనసేన శ్రీశైలం ఓటమి
24 పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత తనయుడు టీడీపీ రాప్తాడు ఓటమి
25 జేసీ అశ్మిత్ రెడ్డి జేసీ ప్రభాకరరెడ్డి టీడీపీ తాడిపత్రి ఓటమి
26 జేసీ పవన్ కుమార్ రెడ్డి జేసీ దివాకరరెడ్డి టీడీపీ అనంతపురం (పార్లమెంట్) ఓటమి
27 గంటి హరీశ్ మాధుర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు టీడీపీ అమలాపురం (పార్లమెంట్) ఓటమి
28 భరత్ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు టీడీపీ విశాఖ (పార్లమెంట్) ఓటమి
29 మాగంటి రూప మురళీమోహన్‌కు కోడలు టీడీపీ రాజమండ్రి (పార్లమెంట్) ఓటమి
30 నాగబాబు పవన్ కల్యాణ్ సోదరుడు జనసేన నరసాపురం (పార్లమెంట్) ఓటమి
31 లావు కృష్ణదేవరాయులు లావు రత్తయ్య కుమారుడు వైసీపీ నరసరావుపేట (పార్లమెంట్) విజయం
32 శ్రుతిదేవి కిశోర్ చంద్రదేవ్ కుమార్తె కాంగ్రెస్ అరకు (పార్లమెంట్) ఓటమి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)