ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి

  • 24 మే 2019
పార్లమెంట్ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏపీలో టీడీపీ 15 స్థానాల నుంచి మూడు స్థానాలకు పడిపోయింది.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసి 11 చోట్ల గెలుపొందింది. బీజేపీ ఒక్క సికింద్రాబాద్ స్థానం నుంచే విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం హైదరాబాద్ స్థానంలో గెలుపొందింది.

గతంతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలను కోల్పోయింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని నాలుగు చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం తన హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది.

టీఆర్ఎస్ పార్టీ 41.29 శాతం ఓట్లను సాధిస్తే బీజేపీ 19.45 శాతం ఓట్లను, కాంగ్రెస్ 29.48 శాతం ఓట్లను సాధించింది.

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 2014లో టీడీపీ 15 చోట్ల విజయం సాధించగా, వైసీపీ 8 చోట్ల గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో 22 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా, టీడీపీ మూడు స్థానలతో సరిపెట్టుకుంది.

తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు...

క్రమసంఖ్య లోక్ సభ స్థానం విజేత పార్టీ ఆధిక్యం సమీప అభ్యర్థి పార్టీ
01 ఆదిలాబాద్ సోయం బాబు రావు బీజేపీ 58493 గోడెం నగేశ్ టీఆర్ఎస్
02 భువనగిరి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ 5,219 బూర నర్సయ్య గౌడ్
03 చేవెళ్ల రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ 14,772 కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్
04 హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఎంఐఎం 2,82,186 భగవంతరావు బీజేపీ
05 కరీంనగర్ బండి సంజయ్ (గెలుపొందారు) బీజేపీ 89508 వినోద్ కుమార్ టీఆర్ఎస్
06 ఖమ్మం నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ 168062 రేణుకా చౌదరి కాంగ్రెస్
07 మహబూబాబాద్ మాలోత్ కవిత టీఆర్ఎస్ 1,46,663 బలరాం నాయక్ కాంగ్రెస్
08 మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి (గెలుపొందారు) టీఆర్ఎస్ 77829 డీకే అరుణ బీజేపీ
09 మల్కాజిగిరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 10,919 మర్రి రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్
10 మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ 316427 గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్
11 నాగర్‌కర్నూల్ పి.రాములు (గెలుపొందారు) టీఆర్ఎస్ 189748 మల్లు రవి కాంగ్రెస్
12 నల్లగొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి (గెలుపొందారు) కాంగ్రెస్ 25682 నరసింహారెడ్డి టీఆర్ఎస్
13 నిజామాబాద్ ధర్మపురి అరవింద్ బీజేపీ 70383 కవిత టీఆర్ఎస్
14 పెద్దపల్లి వెంకటేశ్ నేతకాని టీఆర్ఎస్ 95180 చంద్రశేఖర్ కాంగ్రెస్
15 సికింద్రాబాద్ కిషన్ రెడ్డి బీజేపీ 62,114 తలసాని సాయికిరణ్ యాదవ్ టీఆర్ఎస్
16 వరంగల్ పసునూరి దయాకర్ (గెలుపొందారు) టీఆర్ఎస్ 350298 దొమ్మాడి సాంబయ్య టీఆర్ఎస్
17 జహీరాబాద్ బీబీ పాటిల్ టీఆర్ఎస్ 6166 మదన్ మోహన్ రావు కాంగ్రెస్

ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు

క్రమ సంఖ్య నియోజకవర్గం ఆధిక్యంలో ఉన్న అభ్యర్థి/ విజేత పార్టీ ఆధిక్యం సమీప అభ్యర్థి పార్టీ
1 శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ 8,282 దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ
2 విజయనగరం బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ వైసీపీ 48036 అశోక్ గజపతి రాజు టీడీపీ
3 విశాఖపట్నం ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ 2,875 భరత్ టీడీపీ
4 అనకాపల్లి డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి వైసీపీ 87,829 ఆడారి ఆనంద్ కుమార్ టీడీపీ
5 అరకు(ఎస్టీ) గొడ్డేటి మాధవి వైసీపీ 2,19,836 కిషోర్ చంద్రదేవ్ టీడీపీ
6 కాకినాడ వంగా గీత వైసీపీ 25,738 చలమలశెట్టి సునిల్ టీడీపీ
7 అమలాపురం చింతా అనురాధ వైసీపీ 37,904 గంటి హరీష్ టీడీపీ
8 రాజమండ్రి భరత్ వైసీపీ 1,19,402 మాగంటి రూప టీడీపీ
9 నర్సాపురం క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు వైసీపీ 30,940 శివరామ రాజు టీడీపీ
10 ఏలూరు కోట‌గిరి శ్రీధ‌ర్ వైసీపీ 1,65,925 మాగంటి వేంకటేశ్వరరావు టీడీపీ
11 విజయవాడ కేశినేని నాని టీడీపీ 8,138 పొట్లూరి వరప్రసాద్ వైసీపీ
12 మచిలీపట్నం బాల‌శౌరి వైసీపీ 60,141 కొనకళ్ల నారాయణ రావు టీడీపీ
13 గుంటూరు గల్లా జయదేవ్ టీడీపీ 4800 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ
14 నర్సారావుపేట లావు కృష్ణ‌దేవ‌రాయులు వైసీపీ 1,53,976 రాయపాటి సాంబశివరావు టీడీపీ
15 బాపట్ల నందిగాం సురేశ్ వైసీపీ 15,881 మల్యాద్రి శ్రీరాం టీడీపీ
16 ఒంగోలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ 2,12,855 సిద్దా రాఘవరావు టీడీపీ
17 నెల్లూరు ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీ 1,45,911 బీద మస్తాన్ రావు టీడీపీ
18 కడప వైఎస్ అవినాశ్ రెడ్డి వైసీపీ 3,77,153 ఆదినారాయణ రెడ్డి టీడీపీ
19 హిందూపురం గోరంట్ల మాధవ్ వైసీపీ 138309 నిమ్మల కిష్టప్ప టీడీపీ
20 అనంతపురం తలారి రంగయ్య వైసీపీ 1,41,534 జేసీ పవన్ రెడ్డి టీడీపీ
21 నంద్యాల బ్రహ్మాంనంద రెడ్డి వైసీపీ 2,46,419 శివానంద రెడ్డి టీడీపీ
22 కర్నూలు సంజీవ్ కుమార్ వైసీపీ 1,46,393 కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ
23 రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ 2,68,284 సత్యప్రభ టీడీపీ
24 తిరుపతి(ఎస్సీ) దుర్గా ప్ర‌సాద్ వైసీపీ 2,28,376 పనబాక లక్ష్మీ టీడీపీ
25 చిత్తూరు నల్లకొండగారి రెడ్డప్ప వైసీపీ 1,35,951 శివప్రసాద్ టీడీపీ

మధ్యాహ్నం 3.17

నిజామాబాద్‌లో 6వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 53 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. వరంగల్ పార్లమెంట్‌లో 12వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 2,27,617 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Image copyright TWITTER/KAVITHA KALVAKUNTLA
చిత్రం శీర్షిక నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత వెనుకంజలో ఉన్నారు.

మధ్యాహ్నం 1.32

మహబూబాబాద్‌లో 13 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత 1 లక్ష 18 వేల ఆధిక్యంలో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పి.రాములు 15,4397 ఓట్లు ఆధిక్యంంలో కొనసాగుతున్నారు.

ఖమ్మం పార్లమెంట్ 19వ రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 1,07,343 ఓట్లు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

మెదక్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,01834 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

మధ్యాహ్నం 12.30

మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి 34143 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీజేపి అభ్యర్థి డికె అరుణ ఉన్నారు. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి సంజయ్ 43 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో 10వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మంలో 14వ రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 69,444 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నిజామాబాద్‌లో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 35634 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఏపీలో 23 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

మధ్యాహ్నం 12.16

ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాల్లో 23 చోట్ల వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. విజయవాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు 415 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

12వ రౌండు పూర్తయ్యేసరికి ఖమ్మంలో టిఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 62,050 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్ ముగిసేసరికి 55228 ఓట్ల మెజారిటీతో కరీంగనర్‌లో ముందంజలో బీజేపీ అభ్యర్థి సంజయ్, చేవెళ్ల లో 7500 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు.

ఉదయం 11.50

ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాల్లో 25 చోట్లా వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల ముందంజలో ఉన్నారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని మొదట ఆధిక్యంలో ఉండగా ఇప్పుడు అక్కడా వైసీపీ ముందంజ వేసింది. ఆ పార్టీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) 227 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Image copyright uttam/fb

ఉదయం 11.47

తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజ... ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపని జనసేన

తెలంగాణలో నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌లో ఆ పార్టీ ప్రభావం చూపిస్తోంది.

ఆదిలాబాద్‌లో బీజపీ అభ్యర్థి సోయం బాబురావు 32354 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం నగేశ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. నిజమాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ 12314 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

సికింద్రబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 29746 ఓట్ల ఆధిక్యంతో, కరీంగనర్‌లో బండి సంజయ్ 47228 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒకే ఒక లోక్ సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన బండారు దత్తాత్రేయ ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా బరిలోకి దిగిన జనసేన పార్టీ 25 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడా ఆధిక్యంలో కనిపించడం లేదు. ఈ పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి పోటీ చేసిన మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ, నర్సాపురం నుంచి పోటీ చేసిన పవన్ సోదరుడు నాగబాబు వెనుకంజలో ఉన్నారు.

ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి నల్గొండ పార్లమెంట్ పరిధిలో 12,969 ఓట్ల ఆధిక్యంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కరీంగనర్‌లో బీజేపీ అభ్యథి సంజయ్ 51992 ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 27008 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 11.05

నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 12,221 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 11.02

భువనగిరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ 1,382 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

ఉదయం 10.57

కాకినాడ పార్లమెంటు స్థానం: వైసీపీ అభ్యర్థి వంగా గీత 15,401 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం 10.51

సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి 17,772 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

వచ్చిన ఓట్లు:

  • అంజన్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్) 17,741
  • కిషన్ రెడ్డి (బీజేపీ) 50,979
  • సాయి యాదవ్ (టీఆర్‌ఎస్) 33,207
Image copyright Revanth reddy/fb

ఉదయం 10.26

నిజామాబాద్‌లో తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందజంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తర్వాత స్థానంలో ఉన్నారు. బీజేపీకి 18,280 ఓట్ల ఆధిక్యం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 24 చోట్ల వైసీపీ ముందంజలో ఉంది. కేవలం ఒకే ఒక స్థానం (విజయవాడ)లో టీడీపీ ముందంజలో ఉంది.

విజయవాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ముందంజలో ఉన్నారు. తర్వాత స్థానంలో వైసీపీ అభ్యర్థి పొట్టూరి వరప్రసాద్ ఉన్నారు. కేశినేని నాని 530 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇక జనసేన నుంచి విశాఖ పార్లమెంట్‌కు పోటీ చేసిన లక్ష్మీనారాయణ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి భరత్‌పై 1699 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగాబాబు నర్సాపురం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ముందంజలో ఉన్నారు. ఆయన 1922 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 10.03

తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కవిత వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి ముందజంలో ఉన్నారు.

కరీంనగర్‌లోనూ బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 22260 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ - పొన్నం ప్రభాకర్ - 23776, టిఆర్ఎస్ - వినోద్ కుమార్ - 51104,బిజెపి- బండి సంజయ్ - 73364 ఓట్లు సాధించారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సోయం బాబు రావు ముందంజలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 3వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 35,713 ఓట్లు, టీఆర్ఎస్‌కు 22562 , కాంగ్రెస్‌కు 17559 ఓట్లు పడ్డాయి. బీజేపీ 13151 ఆధిక్యతతో ఉంది.

ఉదయం 9.50

విశాఖపట్నం: జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ 416 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

చిత్రం శీర్షిక వైసీపీ శ్రేణుల సంబరాలు

ఉదయం 9.38

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం: మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

పోలైన ఓట్లు

  • టీఆర్ఎస్- 4,918
  • బీజేపీ- 4818
  • కాంగ్రెస్- 4247

ఉదయం 9.28

ఆంధ్రప్రదేశ్: వైసీపీ 9 స్థానాల్లో, టీడీపీ 4 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

ఉదయం 9.23

తెలంగాణ: టీఆర్‌ఎస్ 11, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఎంఐఎం 1 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

కరీంనగర్, ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 9.22

ఆంధ్రప్రదేశ్: వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

ఉదయం 9.20

విశాఖ పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి భరత్ 2015 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఉదయం 9.15

కరీంనగర్: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ ముందంజలో నిలిచింది. బీజేపీకి 3,062 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 2,939, కాంగ్రెస్2కు 2,881 ఓట్లు వచ్చాయి.

ఉదయం 9.13

వైసీపీ 4 స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో ముందజలో ఉన్నాయి.

ఉదయం 9.10

టీఆర్‌ఎస్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంఐఎం ఒక స్థానంలో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

ఉదయం 9.05

మచిలీపట్నం:599 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.

ఉదయం 9.00

జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల్లో పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ.

అనంతపురం:

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ముందంజ. వైసీపీకి 341 ఓట్లు, టీడీపీకి 168 ఓట్లు.

ఉదయం 8.50

ఖమ్మం:

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు 3,159 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నామా నాగేశ్వరావుకు (టీఆర్ఎస్) - 5,606 ఓట్లు, రేణుకా చౌదరికి (కాంగ్రెస్) - 2,447 ఓట్లు.

ఉదయం 8.47

విశాఖ:

పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో టీడీపీ అభ్యర్థి భరత్‌ ఆధిక్యంలో నిలిచారు.

ఉదయం 8.45

సికింద్రాబాద్:

పోస్టల్ బ్యాలెట్స్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ 1,086 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 8.30

వరంగల్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం:

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 8.00

ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలి దశ (ఏప్రిల్ 11) లో ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలో 62.53 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 79.88 శాతం పోలింగ్ నమోదైంది.

ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజవర్గం నుంచి 185 మంది బరిలో నిలిచారు. దీంతో దేశవ్యాప్తంగా అత్యధికమంది అభ్యర్థులు పోటీ పడిన నియోజకవర్గంగా నిజామాబాద్ నిలిచింది.

ఈ నియోజకవర్గ ఫలితం రాత్రి 10.30 గంటల తర్వాత వెలువడొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు? దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ పేజీలో అప్‌డేట్ అవుతుంది గమనించగలరు.

NOTE: తాజా సమాచారం కోసం ఈ లింక్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌కు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..

క్రమ సంఖ్య నియోజకవర్గం వైసీపీ టీడీపీ జనసేన కూటమి
1 శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాసరావు కింజరాపు రామ్మోహన్ నాయుడు మెట్ట రామారావు
2 విజయనగరం బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ అశోక్ గజపతి రాజు ముక్కా శ్రీనివాసరావు
3 విశాఖపట్నం ఎంవీవీ సత్యనారాయణ భరత్.ఎం వి. లక్ష్మీనారాయణ
4 అనకాపల్లి డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి అడారి ఆనంద్ సీహెచ్ పార్థసారధి
5 అరకు(ఎస్టీ) గొడ్డేటి మాధవి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ పాంగి రాజారావు
6 కాకినాడ వంగా గీత చలమలశెట్టి సునీల్ జ్యోతుల వెంకటేశ్వరరావు
7 అమలాపురం అనురాధ గంటి హరీశ్ డీఎంఆర్ శేఖర్
8 రాజమండ్రి మార్గాని భరత్ మాగంటి రూప ఆకుల సత్యనారాయణ
9 నర్సాపురం క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణం రాజు శివరామరాజు వేటుకూరి నాగబాబు
10 ఏలూరు కోట‌గిరి శ్రీధ‌ర్ మాగంటి బాబు పుల్లారావు
11 విజయవాడ పీవీపీ కేశినేని నాని ముత్తంశెట్టి సుధాకర్
12 మచిలీపట్నం బాల‌శౌరి కొనకళ్ల నారాయణ బండ్రెడ్డి రాము
13 గుంటూరు మోదుగల వేణుగోపాల్ రెడ్డి గల్లా జయదేవ్‌ బి. శ్రీనివాస్
14 నర్సారావుపేట లావు కృష్ణ‌దేవ‌రాయులు రాయపాటి సాంబశివరావు నయూబ్ కమల్
15 బాపట్ల నందిగాం సురేశ్ శ్రీరాం మాల్యాద్రి కె. దేవానంద్
16 ఒంగోలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి శిద్దా రాఘవరావు బెల్లంకొండ సాయిబాబా
17 నెల్లూరు ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి బీదా మస్తాన్‌రావు రాజగోపాల్ (సీపీఐ)
18 కడప వైఎస్ అవినాశ్ రెడ్డి ఆది నారాయణరెడ్డి ఈశ్వరయ్య(సీపీఐ)
19 హిందూపురం గోరంట్ల మాధవ్ నిమ్మల కిష్టప్ప నామినేషన్ తిరస్కరణకు గురైంది.
20 అనంతపురం తలారి రంగయ్య జేసీ పవన్‌రెడ్డి డి. జగదీష్ (సీపీఐ)
21 నంద్యాల బ్రహ్మాంనంద రెడ్డి మాండ్ర శివానంద్‌రెడ్డి ఎస్పీవై రెడ్డి
22 కర్నూలు సంజీవ్ కుమార్ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కొమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (సీపీఎం)
23 రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డీకే సత్యప్రభ సయ్యద్ ముకరం చాంద్
24 తిరుపతి(ఎస్సీ) దుర్గా ప్ర‌సాద్ పనబాక లక్ష్మి శ్రీహరిరావు (బీఎస్పీ)
25 చిత్తూరు నల్లకొండగారి రెడ్డప్ప శివ ప్రసాద్‌ పుణ్యమూర్తి (బీఎస్పీ)
Image copyright Getty Images

తెలంగాణలోని పార్లమెంట్‌ స్థానాల నుంచి పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే...

క్రమసంఖ్య లోక్ సభ స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇతరులు
01 ఆదిలాబాద్ జి. నగేశ్ రమేశ్ రాథోడ్ సోయం బాపురావు
02 భువనగిరి బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పడాల వెంకట శ్యామ్
03 చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బి.జనార్దన్ రెడ్డి
04 హైదరాబాద్ పుస్తె శ్రీకాంత్ ఫిరోజ్ ఖాన్ భగవంతరావు అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం)
05 కరీంనగర్ బి. వినోద్ కుమార్ పొన్నం ప్రభాకర్ బండి సంజయ్
06 ఖమ్మం నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి దేవకి వాసుదేవరావు జి.వెంకటేశ్వర రావు (సీపీఐఎంఎల్)
07 మహబూబాబాద్ మాలోత్ కవిత బలరాం నాయక్ హుస్సేన్ నాయక్
08 మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి చల్లా వంశీచంద్ రెడ్డి డీకే. అరుణ
09 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి రాంచంద్రర్ రావు బి. మహేందర్ రెడ్డి (జనసేన)
10 మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి గాలి అనిల్ కుమార్ రఘునందన్ రావు
11 నాగర్‌కర్నూల్ పి.రాములు మల్లు రవి బంగారు శృతి
12 నల్లగొండ వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఉత్తం కుమార్ రెడ్డి గార్లపాటి జితేందర్ మల్లు లక్ష్మీ (సీపీఎం)
13 నిజామాబాద్ కల్వకుంట్ల కవిత మధు యాష్కి గౌడ్ ధర్మపురి అర్వింద్
14 పెద్దపల్లి వెంకటేశ్ నేతకాని ఎ. చంద్రశేఖర్ రావు సోగాల కుమార్
15 సికింద్రాబాద్ తలసాని సాయికిరణ్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ జి. కిషన్ రెడ్డి
16 వరంగల్ పసునూరి దయాకర్ దొమ్మాటి సాంబయ్య చింతా సాంబమూర్తి
17 జహీరాబాద్ బీబీ పాటిల్ మదన్ మోహన్ రావు బాణాల లక్ష్మారెడ్డి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)