ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానాల్లో విజయం

  • 24 మే 2019
జగన్ Image copyright YSRCP
0
tdp
0
ysrcp
0
Others
Source: CVoter
Source: CVoter
Leading Candidate Party Status

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది.

టీడీపీ 23 స్థానాలకు పరిమితం కాగా జనసేన ఒకే ఒక నియోజకవర్గంలో విజయం సాధించింది.

175 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరోవైపు టీడీపీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రస్తుత సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు గాజువాక, భీమవరంలలో ఓటమి పాలవగా.. ఆ పార్టీకి చెందిన రాపాక వరప్రసాద్(రాజోలు నియోజకవర్గం) ఒక్కరే విజయం సాధించారు.

చిత్రం శీర్షిక గాజువాకలో పవన్ కల్యాణ్‌పై గెలిచిన తిప్పల నాగిరెడ్డి

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఆధిక్యంలో ఉన్నారు

క్ర.సం/ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం గెలిచిన పార్టీ విజేత
1 ఇచ్చాపురం టీడీపీ బెందాళం అశోక్
2 పలాస వైసీపీ సీదిరి అప్పలరాజు
3 టెక్కలి టీడీపీ కింజరాపు అచ్చెన్నాయుడు
4 పాతపట్నం వైసీపీ రెడ్డి శాంతి
5 శ్రీకాకుళం వైసీపీ ధర్మాన ప్రసాదరావు
6 ఆముదాలవలస వైసీపీ తమ్మినేని సీతారాం
7 ఎచ్చెర్ల వైసీపీ గొర్లె కిరణ్ కుమార్
8 నరసన్నపేట వైసీపీ ధర్మాన కృష్ణదాస్
9 రాజాం (ఎస్సీ) వైసీపీ కంబాల జోగులు
10 పాలకొండ (ఎస్టీ) వైసీపీ విశ్వసరాయి కళావతి
విజయనగరం నియోజకవర్గం
11 కురుపాం (ఎస్టీ) వైసీపీ పాములు పుష్ప శ్రీవాణి
12 పార్వతీపురం (ఎస్సీ) వైసీపీ అలజంగి జోగారావు
13 సాలూరు (ఎస్టీ) వైసీపీ పీడిక రాజన్న దొర
14 బొబ్బిలి వైసీపీ శంభంగి వెంకట చిన్నప్పలనాయుడు
15 చీపురుపల్లి వైసీపీ బొత్స సత్యనారాయణ
16 గజపతినగరం వైసీపీ అప్పలనరసయ్య బొత్సా
17 నెల్లిమర్ల వైసీపీ బి. అప్పల నాయుడు
18 విజయనగరం వైసీపీ కోలగట్ల వీరభద్రస్వామి
19 శృంగవరపుకోట వైసీపీ కె.శ్రీనివాస్
విశాఖపట్నం నియోజకవర్గం
20 భీమిలి వైసీపీ అవంతి శ్రీనివాస్
21 విశాఖపట్నం తూర్పు టీడీపీ వెలగపూడి రామకృష్ణ బాబు
22 విశాఖపట్నం దక్షిణం టీడీపీ వాసుపల్లి గణేశ్ కుమార్
23 విశాఖపట్నం ఉత్తరం టీడీపీ గంటా శ్రీనివాసరావు
24 విశాఖపట్నం పశ్చిమం టీడీపీ పెతకంశెట్టి గణ వెంకటరెడ్డినాయుడు(గణబాబు)
25 గాజువాక వైసీపీ తిప్పల నాగిరెడ్డి
26 చోడవరం వైసీపీ కరణం ధర్మశ్రీ
27 మాడుగుల వైసీపీ బి.ముత్యాలనాయుడు
28 అరకు (ఎస్టీ) వైసీపీ చెట్టి ఫల్గుణ
29 పాడేరు (ఎస్టీ) వైసీపీ కొత్తగుల్లి భాగ్యలక్ష్మి
30 అనకాపల్లి వైసీపీ ఏవీఎస్ఎస్ అమరనాథ్
31 పెందుర్తి వైసీపీ అదీప్ రాజు
32 యలమంచిలి వైసీపీ కన్నబాబు రాజు
33 పాయకరావుపేట (ఎస్సీ) వైసీపీ గొల్ల బాబూరావు
34 నర్సీపట్నం వైసీపీ ఉమాశంకర్ గణేశ్
తూర్పు గోదావరి నియోజకవర్గం
35 తుని వైసీపీ దాడిశెట్టి రాజా
36 పత్తిపాడు వైసీపీ పూర్ణచంద్ర ప్రసాద్ పర్వత
37 పిఠాపురం వైసీపీ దొరబాబు పెండెం
38 కాకినాడ రూరల్ వైసీపీ కురసాల కన్నబాబు
39 పెద్దాపురం టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప
40 అనపర్తి వైసీపీ సత్య సూర్యనారాయణ రెడ్డి
41 కాకినాడ సిటీ వైసీపీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి
42 రామచంద్రాపురం వైసీపీ శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
43 ముమ్మిడివరం వైసీపీ పొన్నాడ వెంకట సతీశ్
44 అమలాపురం (ఎస్సీ) వైసీపీ పి. విశ్వరూప్
45 రాజోలు (ఎస్సీ) జనసేన రాపాక వరప్రసాద్
46 పి.గన్నవరం (ఎస్సీ) వైసీపీ కొండేటి చిట్టిబాబు
47 కొత్తపేట వైసీపీ చిర్ల జగ్గిరెడ్డి
48 మండపేట టీడీపీ వై. జోగేశ్వర రావు
49 రాజానగరం వైసీపీ జక్కంపూడి రాజా
50 రాజమండ్రి సిటీ టీడీపీ ఆదిరెడ్డి భవానీ
51 రాజమండ్రి రూరల్ టీడీపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
52 జగ్గంపేట వైసీపీ జ్యోతుల చంటిబాబు
53 రంపచోడవరం (ఎస్టీ) వైసీపీ నాగులపల్లి ధనలక్ష్మి
పశ్చిమ గోదావరి నియోజకవర్గం
54 కొవ్వూరు (ఎస్సీ) వైసీపీ తానేటి వనిత
55 నిడదవోలు వైసీపీ జీఎస్ నాయుడు
56 ఆచంట వైసీపీ చెరుకువాడ శ్రీరంగనాథ్
57 పాలకొల్లు టీడీపీ నిమ్మలరామానాయుడు
58 నర్సాపురం వైసీపీ మదునూరి ప్రసాదరాజు
59 భీమవరం వైసీపీ గ్రంథి శ్రీనివాస్‌
60 ఉండి టీడీపీ రామరాజు(రాంబాబు)
61 తణుకు వైసీపీ కారుమూరి నాగేశ్వరరావు
62 తాడేపల్లిగూడెం వైసీపీ కొట్టు సత్యనారాయణ
63 ఉంగుటూరు వైసీపీ పుప్పాల శ్రీనివాసరావు
64 దెందులూరు వైసీపీ కొఠారు అబ్బాయ చౌదరి
65 ఏలూరు వైసీపీ ఏకె. కృష్ణ శ్రీనివాస్
66 గోపాలపురం (ఎస్సీ) వైసీపీ తలారి వెంకటరావు
67 పోలవరం (ఎస్టీ) వైసీపీ తెల్లం బాలరాజు
68 చింతలపూడి (ఎస్సీ) వైసీపీ వున్నమట్ల రకడ ఎలీజా
కృష్ణా నియోజకవర్గం
69 తిరువూరు (ఎస్సీ) వైసీపీ కె. రక్షణ నిధి
70 నూజివీడు వైసీపీ వెంకట ప్రతాప్ అప్పారావు
71 గన్నవరం టీడీపీ వల్లభనేని వంశీ
72 గుడివాడ వైసీపీ కొడాలి నాని
73 కైకలూరు వైసీపీ డి. నాగేశ్వర రావు
74 పెడన వైసీపీ జోగి రమేశ్
75 మచిలీపట్నం వైసీపీ పేర్ని వెంకటరామయ్య (నాని)
76 అవనిగడ్డ వైసీపీ రమేష్ బాబు సింహాద్రి
77 పామర్రు (ఎస్సీ) వైసీపీ కె. అనిల్ కుమార్
78 పెనమలూరు వైసీపీ పార్థసారధి
79 విజయవాడ పశ్చిమ వైసీపీ వెల్లంపల్లి. శ్రీనివాస్
80 విజయవాడ సెంట్రల్ వైసీపీ మల్లాది విష్ణు
81 విజయవాడ తూర్పు టీడీపీ గద్దె రామ్మోహన్‌ రావు
82 మైలవరం వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్
83 నందిగామ (ఎస్సీ) వైసీపీ ఎం.జగన్మోహన్ రావు
84 జగ్గయ్యపేట వైసీపీ ఉదయ భాను సామినేని
గుంటూరు నియోజకవర్గం
85 పెదకూరపాడు వైసీపీ శంకర రావు నంబూరు
86 తాడికొండ (ఎస్సీ) వైసీపీ ఉండవల్లి శ్రీదేవి
87 మంగళగిరి వైసీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి
88 పొన్నూరు వైసీపీ కిలారి రోశయ్య
89 వేమూరు (ఎస్సీ) వైసీపీ మెరుగు నాగార్జున
90 రేపల్లె టీడీపీ అనగాని సత్యప్రసాద్
91 తెనాలి వైసీపీ అన్నాబత్తుని శివకుమార్
92 బాపట్ల వైసీపీ కోన రఘుపతి
93 ప్రత్తిపాడు (ఎస్సీ) వైసీపీ మేకతోటి సుచరిత
94 గుంటూరు పశ్చిమ టీడీపీ మద్దాలి గిరిధర్ రావు
95 గుంటూరు తూర్పు వైసీపీ మహ్మద్ ముస్తాఫా షేక్
96 చిలకలూరిపేట వైసీపీ వి. రజిని
97 నరసరావుపేట వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
98 సత్తెనపల్లి వైసీపీ అంబటి రాంబాబు
99 వినుకొండ వైసీపీ బోళ్ల బ్రహ్మానాయుడు
100 గురజాల వైసీపీ కాసు మహేశ్ రెడ్డి
101 మాచర్ల వైసీపీ రామకృష్ణా రెడ్డి పిన్నెళ్లి
ప్రకాశం నియోజకవర్గం
102 ఎర్రగొండపాలెం వైసీపీ డాక్టర్ సురేశ్
103 దర్శి వైసీపీ మద్దిశెట్టి వేణుగోపాల్
104 పర్చూరు టీడీపీ ఏలూరు సాంబశివరావు
105 అద్దంకి టీడీపీ గొట్టిపాటి రవికుమార్
106 చీరాల టీడీపీ కరణం బలరాం
107 సంతనూతలపాడు (ఎస్సీ) వైసీపీ టీజేఆర్ సుధాకర్ బాబు
108 ఒంగోలు వైసీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి
109 కందుకూరు వైసీపీ మహీధర్ రెడ్డి
110 కొండపి (ఎస్సీ) టీడీపీ బాల వీరాంజనేయ స్వామి
111 మార్కాపురం వైసీపీ కేపీ నాగార్జున రెడ్డి
112 గిద్దలూరు వైసీపీ అన్నా వెంకటరాంబాబు
113 కనిగిరి వైసీపీ మధుసూదన్ యాదవ్
నెల్లూరు నియోజకవర్గం
114 కావలి వైసీపీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
115 ఆత్మకూరు వైసీపీ మేకపాటి గౌతమ్ రెడ్డి
116 కోవూరు వైసీపీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
117 నెల్లూరు సిటీ వైసీపీ అనిల్ కుమార్ యాదవ్
118 నెల్లూరు రూరల్ వైసీపీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
119 సర్వేపల్లి వైసీపీ కాకాణి గోవర్ధన్ రెడ్డి
120 గూడూరు (ఎస్సీ) వైసీపీ వరప్రసాద్
121 సూళ్ళూరుపేట (ఎస్సీ) వైసీపీ కిలివేటి సంజీవయ్య
122 వెంకటగిరి వైసీపీ ఆనం రామనారాయణ రెడ్డి
123 ఉదయగిరి వైసీపీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
కడప నియోజకవర్గం
124 బద్వేల్ (ఎస్సీ) వైసీపీ జి. వెంకట సుబ్బయ్య
125 రాజంపేట వైసీపీ మేడా మల్లికార్జున రెడ్డి
126 కడప వైసీపీ అంజద్ బాషా
127 కోడూరు (ఎస్సీ) వైసీపీ కొరముట్ల శ్రీనివాసులు
128 రాయచోటి వైసీపీ శ్రీకాంత్ రెడ్డి
129 పులివెందుల వైసీపీ వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి
130 కమలాపురం వైసీపీ రవీంద్రనాథ్ రెడ్డి
131 జమ్మలమడుగు వైసీపీ ఎం. సుధీర్ రెడ్డి
132 ప్రొద్దుటూరు వైసీపీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
133 మైదుకూరు వైసీపీ ఎస్. రఘురామి రెడ్డి
కర్నూలు నియోజకవర్గం
134 ఆళ్లగడ్డ వైసీపీ గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
135 శ్రీశైలం వైసీపీ శిల్పా చక్రపాణి రెడ్డి
136 నందికొట్కూరు (ఎస్సీ) వైసీపీ తొగురు ఆర్ధర్
137 కర్నూలు వైసీపీ హఫీజ్ ఖాన్
138 పాణ్యం వైసీపీ కాటసాని రాంభూపాల్ రెడ్డి
139 నంద్యాల వైసీపీ శిల్పా రవిచంద్రారెడ్డి
140 బనగానపల్లె వైసీపీ కాటసాని రామిరెడ్డి
141 డోన్ వైసీపీ బుగ్గన రాజేంద్రనాథ్‌
142 పత్తికొండ వైసీపీ కంగటి శ్రీదేవి
143 కోడుమూరు (ఎస్సీ) వైసీపీ సుధాకర్ బాబు
144 ఎమ్మిగనూరు వైసీపీ కె.చెన్నకేశవరెడ్డి
145 మంత్రాలయం వైసీపీ వై. బాలనాగిరెడ్డి
146 ఆదోని వైసీపీ వై. సాయి ప్రసాద్ రెడ్డి
147 ఆలూరు వైసీపీ పి.జయరాం
అనంతపురం నియోజకవర్గం
148 రాయదుర్గం వైసీపీ కాపు రామచంద్రారెడ్డి
149 ఉరవకొండ టీడీపీ పయ్యావుల కేశవ్
150 గుంతకల్లు వైసీపీ ఎల్లారెడ్డిగారి వెంకట్రామిరెడ్డి
151 తాడిపత్రి వైసీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి
152 శింగనమల (ఎస్సీ) వైసీపీ జొన్నలగడ్డ పద్మావతి
153 అనంతపురం అర్బన్ వైసీపీ అనంత వెంకట్రామిరెడ్డి
154 కళ్యాణదుర్గం వైసీపీ కేవీ ఉషశ్రీ చరణ్
155 రాప్తాడు వైసీపీ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
156 మడకశిర (ఎస్సీ) వైసీపీ ఎం. తిప్పేస్వామి
157 హిందూపురం టీడీపీ నందమూరి బాలకృష్ణ
158 పెనుకొండ వైసీపీ ఎం.శంకరనారాయణ
159 పుట్టపర్తి వైసీపీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
160 ధర్మవరం వైసీపీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
161 కదిరి వైసీపీ పీవీ సిద్ధారెడ్డి
చిత్తూరు నియోజకవర్గం
162 తంబళ్లపల్లె వైసీపీ ద్వారకానాథరెడ్డి
163 పీలేరు వైసీపీ చింతల రామచంద్రారెడ్డి
164 మదనపల్లె వైసీపీ మొహమ్మద్ నవాజ్ బాషా
165 పుంగనూరు వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
166 చంద్రగిరి వైసీపీ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
167 తిరుపతి వైసీపీ బియ్యపు మధుసూదన్ రెడ్డి
168 శ్రీకాళహస్తి వైసీపీ బియ్యపు మధుసూదన్ రెడ్డి
169 సత్యవేడు (ఎస్సీ) వైసీపీ ఆదిమూలం కోనేటి
170 నగరి వైసీపీ ఆర్కే రోజా
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) వైసీపీ కె. నారాయణ స్వామి
172 చిత్తూరు వైసీపీ ఎ. శ్రీనివాసులు
173 పూతలపట్టు (ఎస్సీ) వైసీపీ యం.బాబు
174 పలమనేరు వైసీపీ ఎన్. వెంకటయ్య గౌడ
175 కుప్పం టీడీపీ నారా చంద్రబాబు నాయుడు

వైసీపీ భారీ మెజారిటీవైపు దూసుకుపోతుండటం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం అని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నరుకు పంపించారు.

Image copyright PMO

జగన్ ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ (గురువారం) సాయంత్రం ఆ పదవికి రాజీనామా చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Image copyright YSR Congress

మోదీ అభినందనలు

వైఎస్ జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

"ప్రియమైన వైఎస్ జగన్... ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు" అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.

- భీమవరంలో పవన్ కల్యాణ్ ఓటమి.. 3838 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ విజయం. గాజువాకలోనూ పవన్ ఓటమి.

- పులివెందులలో 90,543ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపు

- పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి గెలిచారు.

- తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు.

- తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మంత్రి, టీడీపీ అభ్యర్థి చినరాజప్ప నాలుగు వేల మెజారిటీతో గెలుపొందారు.

- చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్‌కే రోజా విజయం సాధించారు.

- శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి 17,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి సుజయక్రిష్ణ రంగారావు ఓటమి. వైసీపీ అభ్యర్థి శంబంగి చిన్నప్పలనాయుడు 8,346 ఓట్ల మెజారిటీతో విజయం

- విజయనగరం జిల్లా నెలిమర్ల వైసీపీ అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు 29,760 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు

- విజయనగరం జిల్లా గజపతినగరంలో బైసీపీ అభ్యర్థి బొత్సా అప్పల నరసయ్య 26,442 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

- విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు 23,814 ఓట్లతో గెలిచారు.

- విజయనగరం నియోకజవర్గంలో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరబ్రహ్మేంద్రస్వామి 5,380 ఓట్ల ఆధిక్యంతో విజయం

- కృష్ణా జిల్లా పెడనలో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ విజయం.

- కడపలో వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా విజయం

- మాచర్ల, శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయం

టీడీపీకి భారీ దెబ్బ..

అధికార తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్నది.

ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాతో పాటు.. రాయలసీమలో కడప, నెల్లూరు జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, పశ్చిమగోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో రెండు స్థానాల్లో టీడీపీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది.

చిత్రం శీర్షిక పలితాల సరళితో టీడీపీ కార్యాలయం వద్ద జనం లేక బోసిపోయింది

ఓటమి బాటలో మంత్రులు..

టీడీపీ అభ్యర్థులు, పలువురు మంత్రులు, పలువురు ఎంపీలు.. కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఘంటా శ్రీనివాసరావు, పితాని, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, లోకేష్, శిద్దా రాఘవరావు (ఎంపీ), సోమిరెడ్డి, నారాయణ, అమర్నాధ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అఖిల ప్రియ, ఆది నారాయణ రెడ్డి (ఎంపీ)లు ఓటమి బాటలో పయనిస్తున్నారు.

Image copyright @ncbn

సాయంత్రం చంద్రబాబు రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళితో అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తమ పార్టీ ఓటమిని అంగీకరించారు.

ఆయన గురువారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.

Image copyright Facebook/Lokesh Paila

జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అద్భుత విజయం సాధించడం పట్ల జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

జగన్‌కు ఫోన్ చేసిన కేసీఆర్.. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.

Image copyright @ktrtrs

కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు కూడా జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మీ శ్రమ అద్భుతమైన ప్రజాదరణ రూపంలో ఫలించింది. మా సహోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పాలనలో మీకు ఆల్ ద బెస్ట్’’ అంటూ అభినందనలు తెలిపారు.

నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను: జగన్

‘'వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానీకానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు.. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను'’ అని వైఎస్ జగన్ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

25న వైసీపీ శాసనసభా పక్ష సమావేశం

వైసీపీ శాసనసభాపక్షం ఈ నెల 25న తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమవుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఎప్పుడు ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌న్న‌ది ఆ సమావేశంలో నిర్ణ‌యిస్తామ‌ని మీడియాతో చెప్పారు.

‘‘రాష్ట్రప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్ సీఎం కాబోతున్నారని.. వైఎస్ఆర్ పాలనను జగన్ తిరిగి అందించనున్నారని’’ ఆయన పేర్కొన్నారు.

‘‘టీడీపీ తొత్తులు కొంతమంది దొంగసర్వేలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారు.. 150 స్థానాల్లో వైసీపీ విజయం ఖాయం.. 25 ఎంపీ స్థానాలు గెలిచి ప్రత్యేకహోదా సాధించనున్నాం’’ అని చెప్పారు.

చిత్రం శీర్షిక వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు

రాష్ట్రప్రజలకు, కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నామంటూ.. ‘‘వైసీపీ నవరత్నాలను, సుదీర్ఘమైన జగన్ పాదయాత్రను ప్రజలు నమ్మారు.. ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేస్తాం’’ అన్నారు.

ప్రజాతీర్పు ముందు ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే అనటానికి నిదర్శనం కుప్పంలో చంద్రబాబు వెనుకంజలో ఉండటమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఉపయోగపడేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు.

ఈ నెల 25వ తేదీ - శనివారం 11 గంటలకు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని.. ఆ తర్వాత జగన్ ప్రమాణస్వీకార తేదీ గురించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మా మద్దతు ఉంటుంది’’ అని ఉద్ఘాటించారు. లోక్‌సభలో రాహుల్ గాంధీకి 50 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.

చిత్రం శీర్షిక వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి తదితరులు పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు

లగడపాటి మీద చీటింగ్ కేసు పెట్టాలి: విజయసాయి రెడ్డి

ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో లగడపాటి బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని.. లేకపోతే చీటింగ్ కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.

కడప జిల్లా పులివెందులలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధిక్యంలో ఉన్నారు.

కుప్పంలో మూడో రౌండ్ ముగిసేసరికి చంద్రబాబుకు 14,414 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థికి 13,318 ఓట్లు పోలయ్యాయి.

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ గాజువాకలో రెండో రౌండ్ ముగిసే సరికి 682 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ భీమవరంలో వెనుకంజలో ఉన్నారు.

అయితే రాజోలులో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద రావు 709 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు.

రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, సుజయ కృష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లి రవీంద్ర, భూమా అఖిలప్రియ, అమర్నాధ్‌రెడ్డి తదితరులు కూడా ఎదురీదుతున్నారు.

చిత్రం శీర్షిక వైసీపీ అభిమానుల సంబరాలు
చిత్రం శీర్షిక వైసీపీ అభిమానుల సంబరాలు

తొలి రౌండ్లలో వైసీపీ ఆధిక్యం... వైసీపీ కార్యాలయంలో సంబరాలు

చాలా నియోజకవర్గాల్లో మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాయి. 100కు పైగా సీట్లలో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉననారు. ఉదయం నుంచే ఫలితాల సరళి తమ పార్టీకి అనుకూలంగా ఉండటంతో అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 1,476 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్యవెంకటగిరిలో 2,478 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిసర్వేపల్లిలో 1,750 ఓట్ల ముందంజలో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి కాకాణిగూడూరులో 1,700 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి వరప్రసాద్నెల్లూరు సిటీలో 2,473 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధి అనిల్నెల్లూరు రూరల్‌లో 3,000 ఓట్ల మెజార్టీలో వైసీపీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఆత్మకూరులో 3,240 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ గౌతంరెడ్డికావలిలో 303 ఓట్ల మెజార్టీలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిఉదయగిరిలో 2,700 ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి

కడప జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రాయచోటి , కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

చిత్రం శీర్షిక వైసీపీ అభిమానుల సంబరాలు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల‌లో వైసీపీ అభ్యర్థి బడుగొండ అప్పలనాయుడు ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్లో 4000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ మొదటి రౌండ్లో 3500 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.

విజయనగరం నియోజకవర్గంలో మూడు రౌండ్లలో వైసీపీ అభ్యర్థి కోలగట్ల 2,244 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

గజపతినగరం అసంబ్లీ మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి 2,311 ఓట్లు మెజారిటీలో ఉన్నారు.

శృంగవరపుకోట అసంబ్లీ మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి 1,317 ఓట్లు మెజారిటీలో ఉన్నారు.

బొబ్బిలి మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి సుజయ్ 247 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి రౌండ్లో వైకాపా ముందజ. తొలిరౌండ్ ముగిసేసరికి 1959 ఆధిక్యం.

రాజానగరం నియోజకవర్గంలో ఫస్ట్ రౌండ్ లో వైసీపీ 4,155 ఓట్లతో ముందంజలో ఉంది.

చిత్రం శీర్షిక వైసీపీ అభిమానుల సంబరాలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వైసీపీ అభ్యర్ధి విశ్వసరాయి కళావతి తొలిరౌండ్‌లో 1,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

విశాఖ జిల్లాలో పెందుర్తి మొదటి రౌండ్‌లో 5,000 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్.

గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీలో మొదటి రౌండ్‌లో వైసీపీకి 1,250 ఓట్లు మెజారిటీ లభించింది. వినుకొండలో మొదటి రౌండ్లో వైసీపీ అభ్యర్థి బ్రహ్మనాయుడు 2,138 ఆధిక్యంలో ఉన్నారు.

చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ అభ్యర్థి ఆర్.కె.రోజా 1,200 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి 1826 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

టెక్కలిలో టీడీపీ అభ్యర్థి అచ్చన్నాయుడు వెనకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి 1,600 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Image copyright @JanaSenaParty
చిత్రం శీర్షిక గాజువాక నియోజకవర్గంలో వపన్ కల్యాణ్ ఆధిక్యంలో ఉన్నారు

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో ఆందోళన

తిరుపతిలో ఎస్‌వీ సెట్ కళాశాల వద్ద కౌంటింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద చీకటిగా ఉందంటూ కౌంటింగ్‌ను కాసేపు నిలిపివేశారు. అద్దాలు పగులగొట్టి ఆందోళనకు దిగారు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ ఆధిక్యంలో ఉన్నారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల‌లో వైసీపీ అభ్యర్థి బడుగొండ అప్పలనాయుడు ఆధిక్యంలో ఉన్నారు.

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు మీద కోలగట్ల వీరభద్ర స్వామి 225 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి పీలా గోవిందు మీద వైసీపీ అభ్యర్థి గుడివాడ అమరనాధ్ 515 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

అరకు అసెంబ్లీలో పోస్టల్ బాలట్‌లో వైసీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ ముందంజలో ఉన్నారు. చెట్టి ఫాల్గుణకు 229 ఓట్లు, టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రావణకుమార్‌కు 3 ఓట్లు లభించాయి.

చిత్రం శీర్షిక విజయవాడలోని ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ కౌంటంగ్ సెంటర్‌లో సిబ్బంది

విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు.

అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజలో ఉన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

చిత్రం శీర్షిక ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లు

మధ్యాహ్నానికి ఫలితాల సరళి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

మధ్యాహ్నం 12గంటల లోపు ఫలితాల సరళి తెలిసిపోతుందని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

వీవీప్యాట్‌ రశీదులను లెక్కించిన తరువాత ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. 2,118 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో 55 కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది.

ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్

టీడీపీకి 100 నుంచి 110 స్థానాలు వచ్చే అవకాశం ఉందని లగడపాటి (ఆర్జీ ఫ్లాష్ టీమ్) సర్వే అంచనా వేసింది. వైఎస్సార్సీపీకి 72 నుంచి 79 స్థానాలు, ఇతరులకు 3-5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే మాత్రం వైసీపీ భారీ మెజార్టీ సాధిస్తుందని చెప్పింది. వైసీపీకి 130 నుంచి 133, టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ - అసెంబ్లీ ఎన్నికలు - ఎగ్జిట్ పోల్స్)
సంస్థ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ ఇతరులు
లగడపాటి(ఆర్జీ ఫ్లాష్ టీమ్) సర్వే 100 ± 10 72 ± 07 --- 03 ± 02
సీపీఎస్ సర్వే 43-44 130-133 0-01 00
టీవీ5 106 68 02 00
వీడీపీ అసోసియేట్స్ 54-60 111-121 01-04 -
Image copyright Getty Images

టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలూ ఎవరితోనూ పొత్తులేకుండానే బరిలో దిగాయి. తొలిసారి ఎన్నికల క్షేత్రంలో అడుగుపెట్టిన జనసేన... సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లింది.

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పులివెందుల నుంచి మరోసారి పోటీ చేశారు.

తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు.

Image copyright Getty Images

ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది?

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్- 64 ప్రకారం, ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. ఆ అధికారి అనుమతితో మాత్రమే పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లు లెక్కింపు కేంద్రంలోకి వెళ్లే వీలుంటుంది.

ఎన్నికల సంఘం నిబంధన- 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం, లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు.

నిబంధన 52ను అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు.

నిబంధన 55(సీ) ప్రకారం, ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒక వేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ప్రతి కౌటింగ్ టేబుల్ మీద బ్లూపాయింట్ పెన్ను, ఫారం 17(సీ)లోని పార్ట్- 2 పేపర్ ఉంచాలి.

ఓట్ల లెక్కింపునకు ముందు 17(సీ) ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు.

తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి రిజల్ట్ (ఫలితాలు) బటన్‌ను నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ వివరాలను నోట్ చేసుకుంటారు.

ఒక్కో రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు.

ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్‌లు ఉంటారు.

Image copyright Getty Images

వారికి ఫోన్ అనుమతి లేదు

లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది. ప్రతి రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు.

ఎన్నికల సంఘం పరిశీలకుడు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపల ఫోన్ వినియోగించుకోడానికి అర్హులు. మిగతా వారు ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతించరు.

ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం వీడియో తీస్తుంది. దాన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతుంది.

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నియోజకవర్గానికి ఓ అయిదు వీవీప్యాట్‌లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి అందులోని స్లిప్పులను లెక్కిస్తారు.

ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్‌లో స్లిప్పుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం లేకపోతే ఫలితాలను ప్రకటిస్తారు.

ఫారం- 20

తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫారం- 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్‌కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా? అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు.

వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడతారు. అవసరం లేదని భావిస్తే ఫారం- 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు.

ఎన్నికల సంఘం నిబంధన- 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి, శాసన సభకు అందిస్తారు.

ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడు అంచెల గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే

క్ర.సం./ శ్రీకాకుళం జల్లా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
1 ఇచ్చాపురం బెందాళం అశోక్ పిరియా సాయిరాజ్ దాసరి రాజు
2 పలాస గౌతు శిరీష సీదిరి అప్పలరాజు కోత పూర్ణచంద్రరావు
3 టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు పేరాడ తిలక్ కణితి కిరణ్ కుమార్
4 పాతపట్నం కలమట వెంకటరమణ శాంతి రెడ్డి గేదెల జ్ఞాన సాగర్
5 శ్రీకాకుళం గుండా లక్ష్మీదేవి ధర్మాన ప్రసాద రావు కోరాడ సర్వేశ్వరరావు
6 ఆముదాలవలస కూన రవికుమార్ తమ్మినేని సీతారాం పేరాడ రామ మోహన రావు
7 ఎచ్చెర్ల కిమిడి కళా వెంకట్రావు జి. కిరణ్ కుమార్ బాడాన వెంకట జనార్దన రావు
8 నరసన్నపేట బగ్గు రమణమూర్తి ధర్మాన కృష్ణ దాసు మెట్ట వైకుంఠ రావు
9 రాజాం (ఎస్సీ) కొండ్రు మురళీ మోహన్‌ కంబాల జోగులు ముచ్చా శ్రీనివాసరావు
10 పాలకొండ (ఎస్టీ) నిమ్మక జయకృష్ణ వి. కళావతి డీవీజీ శంకర రావు (సీపీఐ)
విజయనగరం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన +
11 కురుపం (ఎస్టీ) ప్రియ థాట్రాజ్ పాముల పుష్ఫ శ్రీవాణి అవినాశ్ కుమార్ (సీపీఎం)
12 పార్వతీపురం (ఎస్సీ) బొబ్బిలి చిరంజీవులు ఎ. జోగరాజు గొంగడ గౌరీ శంకరరావు
13 సాలూరు (ఎస్టీ) భాంజ్ దేవ్ రాజన్న దొర బోనెల గోవిందమ్మ
14 బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగా రావు ఎస్‌వీ అప్పలనాయుడు గిరదా అప్పలస్వామి
15 చీపురుపల్లి కిమిడి నాగార్జున బొత్స సత్యనారాయణ మైలపల్లి శ్రీనివాసరావు
16 గజపతినగరం కొండపల్లి అప్పలనాయుడు బొత్స అప్పల నరసయ్య రాజీవ్ కుమార్
17 నెల్లిమర్ల పతివాడ నారాయణస్వామినాయుడు బడుకొండ అప్పల నాయుడు లోకం నాగ మాధవి
18 విజయనగరం అదితి గజపతిరాజు కోలగట్ల వీరభద్ర స్వామి పాలవలస యశస్వి
19 శృంగవరపుకోట కె. లలిత కుమారి కడుబండి శ్రీనివాస రావు కామేశ్వర రావు పాలిపూడి (సీపీఐ)
విశాఖపట్నం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన +
20 భీమిలి సబ్బం హరి అవంతి శ్రీనివాస్‌ పంచకర్ల నాగ సందీప్
21 విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ విజయ నిర్మల అక్కరమణి తాతారావు కోన
22 విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ ద్రోణం రాజు శ్రీనివాస్‌ గిరిధర్ గంపల
23 విశాఖపట్నం ఉత్తరం గంటా శ్రీనివాసరావు కమ్మిల కన్నపరాజు పసుపులేటి ఉషాకిరణ్
24 విశాఖపట్నం పశ్చిమం పీజీవీఆర్ నాయుడు (గణబాబు) విజయ ప్రసాద్‌ మళ్ల జమిశెట్టి వెంకట సత్యనారాయణ మూర్తి (సీపీఐ)
25 గాజువాక పల్లా శ్రీనివాసరావు తిప్పల నాగిరెడ్డి పవన్ కల్యాణ్ కొణిదల
26 చోడవరం కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు కరణం ధర్మశ్రీ పాకలపాటి వెంకట సత్యనారాయణ రాజు
27 మాడుగుల గవిరెడ్డి రామానాయుడు బి. ముత్యాల నాయుడు జి.సన్యాసి నాయుడు
28 అరకు (ఎస్టీ) కిడారి శ్రావణ్ కుమార్ చెట్టి ఫాల్గుణ కిల్లో సురేంద్ర (సీపీఎం)
29 పాడేరు (ఎస్టీ) గిడ్డి ఈశ్వరి భాగ్యలక్ష్మి పసుపులేటి బాలరాజు
30 అనకాపల్లి పి.గోవింద సత్యనారాయణ అమర్నాథ్ గుడివాడ ఏవీఎస్ఎస్ పరుచూరి భాస్కర రావు
31 పెందుర్తి బండారు సత్యనారాయణ మూర్తి అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌ చింతలపూడి వెంకటరామయ్య
32 యెలమంచిలి పంచకర్ల రమేష్ బాబు యువీ. రమణమూర్తి రాజు సుందరపు విజయ్‌ కుమార్‌
33 పాయకరావుపేట (ఎస్సీ) డాక్టర్. బుడుమూరి బంగారయ్య గొల్ల బాబురావు నక్కా రాజబాబు
34 నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు చింతకాయల పి. ఉమశంకర్‌ గణేష్‌ -----
తూర్పు గోదావరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
35 తుని యనమల కృష్ణుడు దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా) రాజా వత్సవాయి వెంకట కృష్ణమ రాజు
36 పత్తిపాడు వరపుల జోగిరాజు (రాజా) పూర్ణ చంద్రప్రసాద్ పర్వత వరపుల తమ్మయ్యబాబు
37 పిఠాపురం ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పెండెం దొరబాబు మాకినీడు శేషుకుమారి
38 కాకినాడ రూరల్ పిల్లి అనంత లక్ష్మీ కురసాల కన్నబాబు పట్నం వెంకటేశ్వర రావు
39 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప తోట వాణి తుమ్మల రామస్వామి
40 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి రేలంగి నాగేశ్వరరావు
41 కాకినాడ సిటీ వనమాడి వేంకటేశ్వరరావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముత్తా శశిధర్‌
42 రామచంద్రాపురం తోట త్రిమూర్తులు శ్రీనివాస వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన పోలిశెట్టి చంద్రశేఖర్
43 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ పితాని బాలకృష్ణ
44 అమలాపురం (ఎస్సీ) అయితాబత్తుల ఆనందరావు పినిపె విశ్వరూపు శెట్టిబత్తుల రాజబాబు
45 రాజోలు (ఎస్సీ) గొల్లపల్లి సూర్యారావు బొంతు రాజేశ్వరరావు రాపాక వరప్రసాద్‌
46 పి.గన్నవరం (ఎస్సీ) నేలపూడి స్టాలిన్ బాబు కొండేటి చిట్టిబాబు పాముల రాజేశ్వరి
47 కొత్తపేట బండారు సత్యానందరావు చిర్ల జగ్గిరెడ్డి బండారు శ్రీనివాసరావు
48 మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు పిల్లి సుభాశ్ చంద్రబోస్ వేగుళ్ల లీలాకృష్ణ
49 రాజానగరం పెందుర్తి వెంకటేష్ జక్కంపూడి రాజా రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
50 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవాని సూర్యప్రకాశ్ రావు అత్తి సత్యనారాయణ
51 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకుల వీర్రాజు కందుల దుర్గేష్‌
52 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ జ్యోతుల చంటిబాబు పాతంశెట్టి సూర్యచంద్ర రావు
53 రంపచోడవరం (ఎస్టీ) వంతల రాజేశ్వరి నాగులపల్లి ధనలక్ష్మి సున్నం రాజయ్య (సీపీఎం)
పశ్చిమ గోదావరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
54 కొవ్వూరు (ఎస్సీ) వంగలపూడి అనిత తానేటి వనిత రవికుమార్ మూర్తి (బీఎస్పీ)
55 నిడదవోలు బూరుగుపల్లి శేషారావు జీఎస్ నాయుడు అటికల రమ్యశ్రీ
56 ఆచంట పితాని సత్యనారాయణ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు జవ్వాది వెంకట విజయరామ్
57 పాలకొల్లు నిమ్మల రామానాయుడు చవటపల్లి సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ) గున్నం నాగబాబు
58 నర్సాపురం బండారు మాధవ నాయుడు ముదునూరి ప్రసాద్ రాజు బొమ్మిడి నాయికర్
59 భీమవరం పులపర్తి రామాంజనేయులు గ్రంథి శ్రీనివాస్ పవన్ కల్యాణ్ కొణిదల
60 ఉండి మంతెన రామరాజు పీవీఎల్ నరసింహారాజు భూపతిరాజు బలరాం (సీపీఎం)
61 తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ కారుమూరి వేంకట నాగేశ్వరరావు పసుపులేటి రామారావు
62 తాడేపల్లిగూడెం ఈలి నాని కొట్టు సత్యనారాయణ బొలిశెట్టి శ్రీనివాస్‌
63 ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు పుప్పాల శ్రీనివాస్ రావు నౌడు వెంకటరమణ
64 దెందులూరు చింతమనేని ప్రభాకర్ పటారి అబ్బయ్య చౌదరి గంటసాల వెంకట లక్ష్మీ
65 ఏలూరు బడేటి కోట రామారావు (బుజ్జి) ఆళ్ల నాని (ఏకే కృష్ణ శ్రీనివాస్) అప్పలనాయుడు రెడ్డి
66 గోపాలపురం (ఎస్సీ) ముప్పిడి వెంకటేశ్వరరావు తలారి వెంకట్రావు సిర్రా భరత్ రావు (బీఎస్పీ)
67 పోలవరం (ఎస్టీ) బొరగం శ్రీనివాసరావు తెల్లం బాలరాజు చిర్రి బాలరాజు
68 చింతలపూడి (ఎస్సీ) కర్రా రాజారావు వీఆర్ ఎలిజా మేక ఈశ్వరయ్య
కృష్ణా నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
69 తిరువూరు (ఎస్సీ) కొత్తపల్లి జవహర్ కె. రక్షణ నిధి నంబూరి శ్రీనివాసరావు (బీఎస్పీ)
70 నూజివీడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
71 గన్నవరం వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావు సయ్యద్ అఫ్సర్ (సీపీఐ)
72 గుడివాడ దేవినేని అవినాష్ కొడాలి నాని (వేంకటేశ్వర రావు) ---
73 కైకలూరు జయమంగళ వెంకట రమణ దూలం నాగేశ్వర రావు బి.వి. రావు
74 పెడన కాగిత కృష్ణ ప్రసాద్‌ జోగి రమేశ్ అంకెం లక్ష్మీ శ్రీనివాస్
75 మచిలీపట్నం కొల్లు రవీంద్ర పేర్ని వెంకటరామయ్య (నాని) బండి రామకృష్ణ
76 అవనిగడ్డ మండలి బుద్ద ప్రసాద్ సింహాద్రి రమేశ్ బాబు ముత్తంశెట్టి కృష్ణా రావు
77 పామర్రు (ఎస్సీ) ఉప్పులేటి కల్పన కె. అనిల్ కుమార్ మేడిపల్లి ఝాన్సీ రాణి
78 పెనమలూరు బోడె ప్రసాద్ కొలుసు పార్థసారథి లంకా కరుణాకర్ దాస్ (బీఎస్పీ)
79 విజయవాడ పశ్చిమ షబానా ఖాతూన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పోతిన వెంకట మహేష్
80 విజయవాడ సెంట్రల్ బోండా ఉమా మహేశ్వరరావు మల్లాది విష్ణు చిగురుపాటి బాబూరావు (సీపీఎం)
81 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు బొప్పన భావ్ కుమార్ బత్తిన రామ్మోహన్ రావు
82 మైలవరం దేవినేని ఉమా మహేశ్వరరావు వసంత కృష్ణ ప్రసాద్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
83 నందిగామ తంగిరాల సౌమ్య జగన్ మోహన్ రావు పుష్పరాజు బచ్చలకూర (బీఎస్పీ)
84 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సామినేని ఉదయభాను ధరణికోట వెంకట రమణ కుమార్
గుంటూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
85 పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్ నంబూరి శంకరరావు పుట్టి సామ్రాజ్యం
86 తాడికొండ (ఎస్సీ) తెనాలి శ్రావణ్‌ కుమార్‌ ఉండవల్లి శ్రీదేవి నీలం రవి కిరణ్ (బీఎస్పీ)
87 మంగళగిరి నారా లోకేశ్ ఆళ్ల రామకృష్ణరెడ్డి ముప్పాళ్ల నాగేశ్వరరావు (సీపీఐ)
88 పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కిలారి వెంకట రోశయ్య బోని పార్వతి
89 వేమూరు (ఎస్సీ) నక్కా ఆనందబాబు మెరుగు నాగార్జున ఏ.భరత్‌ భూషణ్‌
90 రేపల్లె అనగాని సత్యప్రసాద్ మోపిదేవి వెంకటరమణ కమతం సాంబశివ రావుే
91 తెనాలి అలపాటి రాజేంద్రప్రసాద్ అన్నాబత్తుని శివకుమార్‌ నాదెండ్ల మనోహర్‌
92 బాపట్ల అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కోన రఘుపతి ఇక్కుర్తి లక్ష్మీ నరసింహా రావు
93 ప్రత్తిపాడు (ఎస్సీ) డొక్కా మాణిక్యవర ప్రసాద్ మేకతోటి సుచరిత రావెల కిషోర్‌బాబు
94 గుంటూరు పశ్చిమ మద్దాల గిరిధర రావు చంద్రగిరి యేసురత్నం తోట చంద్రశేఖర్‌
95 గుంటూరు తూర్పు మహ్మద్ నజీర్ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా జియా ఉర్ రెహమాన్ షేక్
96 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు విడదల రజని గాదె నాగేశ్వరావు
97 నరసరావుపేట డాక్టర్‌ అరవింద్‌ బాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సయ్యద్‌ జిలానీ
98 సత్తెనపల్లి కోడెల శివప్రసాదరావు అంబటి రాంబాబు యెర్రం వెంకటేశ్వర రెడ్డి
99 వినుకొండ జీవీ ఆంజనేయులు బోళ్ల బ్రహ్మనాయుడు చెన్న శ్రీనివాస రావు
100 గురజాల యరపతినేని శ్రీనివాసరావు కాసు మహేష్‌ రెడ్డి చింతలపూడి శ్రీనివాస్
101 మాచర్ల అన్నపురెడ్డి అంజిరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముళ్ల శ్రీనివాస రావు
ప్రకాశం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
102 ఎర్రగొండపాలెం బూదాల అజితరావు డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్ పీ. గౌతం రాజు
103 దర్శి కదిరి బాబురావు మద్దిశెట్టి వేణుగోపాల్‌ బొటుకు రమేష్
104 పర్చూరు ఏలూరు సాంబశివరావు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పెద్దపూడి విజయ్ కుమార్
105 అద్దంకి గొట్టిపాటి రవికుమార్ బచ్చన చెంచు గరటయ్య కంచర్ల శ్రీకృష్ణ
106 చీరాల కరణం బలరాం ఆమంచి కృష్ణమోహన్‌ కట్టా రాజ్ వినయ్ కుమార్
107 సంతనూతలపాడు (ఎస్సీ) బి. విజయ్ కుమార్ టీజేఆర్‌ సుధాకర్‌బాబు జాల అంజయ్య (సీపీఎం)
108 ఒంగోలు దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాస రెడ్డి షేక్ రియాజ్
109 కందుకూరు పోతుల రామారావు మానుగుంట మహిధర్‌ రెడ్డి పులి మళ్లికార్జున రావు
110 కొండపి (ఎస్సీ) బాల వీరాంజనేయ స్వామి డాక్టర్‌ ఎం.వెంకయ్య కాకి ప్రసాద్ (బీఎస్పీ)
111 మార్కాపురం కందుల నారాయణ రెడ్డి కుందూరు నాగార్జున రెడ్డి ఇమ్మడి కాశీనాథ్
112 గిద్దలూరు ముత్తముల అకోశ్‌రెడ్డి అన్నా వెంకట రాంబాబు బైరబోయిన చంద్రశేఖర్
113 కనిగిరి ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ మన్నేపల్లి లక్ష్మీనారాయణ(సీపీఐ)
నెల్లూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
114 కావలి కాటంరెడ్డివిష్ణువర్ధన్‌ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పసుపులేటి సుధాకర్‌
115 ఆత్మకూరు బొల్లినేని కృష్ణయ్య మేకపాటి గౌతమ్‌ రెడ్డి చీర్ల చిన్నా రెడ్డి
116 కోవూరు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి టి. రాఘవయ్య
117 నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ పోలుబోయిన అనిల్‌కుమార్‌ కేతం రెడ్డి వినోద్ రెడ్డి
118 నెల్లూరు రూరల్ అబ్దుల్‌ అజీజ్‌ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి
119 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్‌రెడ్డి సుంకర హేమలత
120 గూడూరు (ఎస్సీ) పాసింసునీల్ కుమార్ వెలగపల్లివరప్రసాద్‌ రవి పట్టపు (బీఎస్పీ)
121 సూళ్ళూరుపేట (ఎస్సీ) పర్సా వెంకటరత్నయ్య కిలివేటి సంజీవయ్య ఉయ్యాల ప్రవీణ్
122 వెంకటగిరి కురుగొండ్లరామకృష్ణ ఆనం రామనారాయణరెడ్డి పల్లిపాటి రాజా (బీఎస్పీ)
123 ఉదయగిరి బొల్లినేని రామారావు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ---
కడప నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
124 బద్వేల్ (ఎస్సీ) ఓబులాపురం రాజశేఖర్ డా. వెంక‌ట‌ సుబ్బయ్య నాగిపోగు ప్రసాద్
125 రాజంపేట బత్యాల చెంగల్రాయుడు మేడా మల్లికార్జున రెడ్డి ప్రత్తిపాటి కుసుమ కుమారి
126 కడప అమీర్‌ బాబు అంజాద్ బాషా సుంకర శ్రీనివాస్
127 రైల్వే కోడూరు (ఎస్సీ) నర్సింహ ప్రసాద్ కొరముట్ల శ్రీనివాసులు బోనాసి వెంకట సుబ్బయ్య
128 రాయచోటి రమేశ్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎస్.కె.హసన్ భాషా
129 పులివెందుల సింగారెడ్డి వెంకట సతీశ్ రెడ్డి వై.ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి తుపాకుల చంద్ర శేఖర్
130 కమలాపురం పుత్తా నర్సింహారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ...
131 జమ్మలమడుగు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి డా. సుధీర్ రెడ్డి చిన్నగారి వినయ్ కుమార్
132 ప్రొద్దుటూరు లింగారెడ్డిమల్లెల రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోమ శేఖర్ రెడ్డి
133 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ రఘురామిరెడ్డి పందిటి మల్హోత్రా
కర్నూలు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
134 ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ గంగులబ్రిజేంద్ర రెడ్డి ఎస్. రామకృష్ణుడు
135 శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి సన్నపురెడ్డి సుజల
136 నందికొట్కూరు (ఎస్సీ) బండి జయరాజు తొగురుఆర్దర్ అన్నపురెడ్డి బాల వెంకట్
137 కర్నూలు టీజీ భరత్‌ హఫీజ్ ఖాన్ టీ. షద్రాక్ (సీపీఎం)
138 పాణ్యం గౌరు చరితా రెడ్డి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చింతా సురేష్
139 నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి శిల్పా రవిచంద్రారెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి
140 బనగానపల్లె బీసీ జనార్ధన్‌రెడ్డి కాటసాని రామిరెడ్డి అరవింద్ రాణి
141 డోన్ కేఈ ప్రతాప్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కె. రామాంజనేయులు
142 పత్తికొండ కేఈ శ్యాంకుమార్ కె. శ్రీదేవి కె.ఎల్. మూర్తి (సీపీఐ)
143 కోడుమూరు (ఎస్సీ) బి.రామాంజనేయులు జె.సుధాకర్ ఆరెకంటి జీవన్ రాజ్(బీఎస్పీ)
144 ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి చెన్నకేశవ రెడ్డి రేఖజవ్వాజ
145 మంత్రాలయం పి.తిక్కారెడ్డి బాల నాగిరెడ్డి బి.లక్ష్మన్న
146 ఆదోని మీనాక్షి నాయుడు సాయిప్రసాద్ రెడ్డి మల్లికార్జునరావు (మల్లప్ప)
147 ఆలూరు కోట్ల సుజాతమ్మ గుమ్మనూరు జయరామ్ ఎస్. వెంకప్ప
అనంతపురం నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
148 రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు కాపు రామచంద్రారెడ్డి కె. మంజునాథ్ గౌడ్
149 ఉరవకొండ పయ్యావుల కేశవ్ విశ్వేశ్వర రెడ్డి ఎస్. రవి కుమార్
150 గుంతకల్లు ఆర్‌.జితేంద్రగౌడ్‌ వై. వెంకట్రామిరెడ్డి మధుసూదన్ గుప్తా
151 తాడిపత్రి జేసీ అశ్మిత్‌రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి కదిరి శ్రీకాంత్ రెడ్డి
152 శింగనమల (ఎస్సీ) బండారు శ్రావణి జె. పద్మావతి మిద్దె రవీంద్ర బాబు (బీఎస్పీ)
153 అనంతపురం ప్రభాకర్ చౌదరి అనంత వెంకట రామిరెడ్డి వరుణ్
154 కళ్యాణదుర్గం ఉమామహేశ్వరనాయుడు కె.వి.ఉషా కరణం రాహుల్
155 రాప్తాడు పరిటాల శ్రీరాం టీ. ప్రకాష్ రెడ్డి సాకె పవన్ కుమార్
156 మడకశిర (ఎస్సీ) కె.ఈరన్న డాక్టర్ తిప్పేస్వామి మాల సోమన్న (బీఎస్పీ)
157 హిందూపురం నందమూరి బాలకృష్ణ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆకుల ఉమేష్
158 పెనుకొండ బీకే పార్థసారథి శంకర్ నారాయణ పెద్దిరెడ్డి గారి వరలక్ష్మి
159 పుట్టపర్తి పల్లె రఘునాథ రెడ్డి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పత్తి చలపతి
160 ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మధుసూధన్‌ రెడ్డి
161 కదిరి కందికుంట వెంకటప్రసాద్‌ డాక్టర్ సిద్దారెడ్డి భైరవ ప్రసాద్ పెరుగు చిన్న
చిత్తూరు నియోజకవర్గం టీడీపీ వైసీపీ జనసేన+
162 తంబళ్లపల్లె శంకర్‌ యాదవ్‌ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి
163 పీలేరు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి ...
164 మదనపల్లె దొమ్మాలపాటిరమేశ్‌ నవాజ్ భాషా స్వాతి గంగారపు
165 పుంగనూరు ఎన్.అనేషరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బోడె రామచంద్ర యాదవ్‌
166 చంద్రగిరి పులపర్తి వెంకట మణిప్రసాద్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శిట్టిసురేంద్ర
167 తిరుపతి సుగుణ భూమన కరుణాకర్ రెడ్డి చదలవాడ కృష్ణమూర్తి
168 శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూధన్ రెడ్డి వినుత నగరం
169 సత్యవేడు (ఎస్సీ) జేడీ రాజశేఖర్‌ కె. ఆదిమూలం విజయ్ కుమార్ (బీఎస్పీ)
170 నగరి గాలి భానుప్రకాశ్ ఆర్.కె. రోజా నాగనబోయిన ప్రవళిక (బీఎస్పీ)
171 గంగధార నెల్లూరు (ఎస్సీ) హరికృష్ణ నారాయణ స్వామి యుగంధర్.పీ
172 చిత్తూరు ఏఎస్‌ మనోహర్‌ ఎ.శ్రీనివాసులు ఎన్.దయారామ్
173 పూతలపట్టు (ఎస్సీ) లలిత కుమారి ఎం.ఎస్. బాబు యం. జగపతి
174 పలమనేరు ఎన్. అమర్‌నాథ రెడ్డి వెంకటయ్య గౌడ్ పోలూరు శ్రీకాంత్ నాయుడు
175 కుప్పం చంద్రబాబు నాయుడు చంద్రమౌళి వెంకటరమణ ముద్దినేని

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)