వైసీపీ మెజారిటీకి ప్రజాశాంతి పార్టీ గండికొట్టిందా? ఒకే పేరుతో నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లెన్ని?

  • 24 మే 2019
జగన్, కేఏ పాల్ Image copyright FACEBOOK

ఆంధప్రదేశ్ ఎన్నికల్లో కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ చాలా చోట్ల తన అభ్యర్థులను బరిలోకి దింపింది. కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వ్యక్థులను బరిలోకి దింపిందనే వార్తలు వచ్చాయి. దీనిపై వైసీపీ ప్రతినిధులు మార్చి 26న దిల్లీకి వచ్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.

దాదాపు 35 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోలిన అభ్యర్థులను ప్రజాశాంతి పోటీలో నిలబెట్టిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రజాశాంతి ఎన్నికల గుర్తు అయిన హెలికాప్టర్ కూడా తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉందని, దీనిపైనా చర్యలు తీసుకోవాలని కోరింది.

అయితే, కేఏ పాల్ నిలబెట్టిన అభ్యర్థుల వల్ల వైసీపీకి నష్టం జరిగిందా..? ఏ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల మెజారిటీపై ప్రభావం పడింది? ఫలితాలు ఎలా ఉన్నాయి? అనేది కింది పట్టికలో చూడొచ్చు.

క్రమసంఖ్య నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వచ్చిన ఓట్లు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి వచ్చిన ఓట్లు
1 పెనమలూరు కొలుసు పార్థసారధి 101485 వేమూరి పార్థసారధి 300
2 మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 114940 వెంకట కృష్ణారావు బొగులు 129
3 పరుచూరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు 95429 దగ్గుపాటి వెంకటేశ్వర్లు 178
4 చీరాల ఆమంచి కృష్ణమోహన్ 66482 కర్న కృష్ణమోహన్ రావు 115
5 ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి 101022 బాలినేని శ్రీనివాస్ 400
6 మార్కాపురం కుందూరు నాగార్జునరెడ్డి 92680 ఎరువ నాగార్జునరెడ్డి 311
7 ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 106487 మద్దినేని చంద్రయ్య 175
8 జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి 125005 మారం రెడ్డి సుధీర్ రెడ్డి 120
9 డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ 100845 బి రాజేంద్ర 200
10 ఆలూరు పి. జయరాం 107101 బి. జయరాముడు 1327
11 ఉరవకొండ వై విశ్వేశ్వరరెడ్డి 88077 కె విశ్వనాథరెడ్డి 184
12 కల్యాణదుర్గం కేవీ ఉష 88051 ఉషరాణి 212
13 కదిరి పెదబల్లి వెంకట సిద్దారెడ్డి 102432 చంకా సిద్దారెడ్డి 218
14 పీలేరు చింతల రామచంద్రారెడ్డి 87300 చింతల రామిరెడ్డి 239
15 పలమనేరు ఎన్ వెంకట గౌడ 119241 వెంకటరమణ నాయుడు 1107
16 మచిలీపట్నం పేర్ని వెంకట రామయ్య(నాని) 66141 పెంట వీరవెంకట నాగ మురళీధర్ 211
17 కైకలూరు దూలం నాగేశ్వరరావు 82128 దాసి నాగేశ్వరరావు 137
18 గుడివాడ వెంటేశ్వరరావు కొడాలి 89833 వెంటేశ్వరరావు కొడాలి 242
19 నిడదవోలు గడ్డం శ్రీనివాస్ నాయుడు 81001 గుడపాటి శ్రీనివాస్ 185
20 రాజోలు బొంతు రాజేశ్వరరావు 49239 బొంతు రాజేశ్వరరావు 206

పై పట్టికను గమనిస్తే వైసీపీ మెజారిటీపై ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగా కూడా లేదని అర్థమవుతుంది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల డిపాజిట్లు సైతం కోల్పోయారు.

ప్రజాశాంతి ఎన్నికల గుర్తు అయిన హెలికాప్టర్ వల్ల కూడా తమకు నష్టం చేకూరుతుందని వైసీపీ భావించింది. కానీ, అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది.

నోట్ : ఈ వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి సేకరించినవి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు