బీబీసీ పేరుతో నకిలీ సర్వే.. ఎన్నికల ఫలితాలపై బీబీసీ ఎప్పుడూ సర్వే చేయలేదు

  • 22 మే 2019
లోక్‌సభ ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వోంలోని ఎన్డీయే కూటమి ఓడిపోతుందని 'బీబీసీ' సర్వేలో తేలిందంటూ సోషల్ మీడియాలో ఓ నకిలీ వార్త చక్కర్లు కొడుతోంది.

వాట్సాప్‌లో ఇది వైరల్‌గా మారింది.

బీబీసీ, అమెరికా నిఘా సంస్థ సీఐఏ కలిసి సర్వే చేపట్టాయని, ఎన్డీయే కూటమికి 177 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చాయని ఈ పోస్ట్ పేర్కొంది. యూపీఏ 200కు పైగా స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్డీయేకు 18 నుంచి 23, పశ్చిమ బెంగాల్‌లో 3 నుంచి 5, బిహార్‌లో 8 నుంచి 9 వరకూ ఎన్డీయేకు సీట్లు వస్తాయని ఆ పోస్ట్‌లో ఉంది.

ఈ వార్త నిజమైనదా, కాదా అని ప్రశ్నిస్తు 300కు పైగా మంది వాట్సాప్ ద్వారా బీబీసీని సంప్రదించారు.

ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు బీబీసీ ఎప్పుడూ సర్వేలు చేపట్టదని చాలా సార్లు స్పష్టం చేసింది.

Image copyright SM Viral Post

గతంలోనూ ఇలాంటి పోస్ట్‌లు

ఎన్నికల ఫలితాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు బీబీసీ పేరును వాడుకోవడం ఇది తొలిసారేమీ కాదు.

హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా ఇలాంటి పోస్ట్‌లు కనిపించాయి. ఇవన్నీ నకీలవంటూ బీబీసీ ఇదివరకూ వివరణ ఇచ్చింది.

బీబీసీ హిందీ ఎడిటర్ ముకేశ్ శర్మ కూడా ఈ విషయంపై ఫేస్‌బుక్‌లో స్పందించారు.

''బీబీసీ ఎన్నికల సర్వే ఫలితాలంటూ చాలా సార్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది. బీబీసీ ఎన్నికల సర్వేలేవీ చేపట్టదు. ఏదో ఒక సంస్థే చేపట్టిన సర్వేను కూడా ప్రచురించదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లోనూ ఇలాంటి పోస్ట్‌లు చక్కర్లు కొట్టాయి. అదంతా నకిలీ ప్రచారమే'' అని పేర్కొన్నారు.

Image copyright SM Viral

జనాలను తప్పుదోవ పట్టించేందుకు వాట్సాప్ మెసెజ్‌లో నకిలీ సర్వే సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో పెట్టి, అదనంగా దానికి బీబీసీ వెబ్‌సైట్ లింక్‌ను ఎంబెడ్ చేస్తున్నారు.

ఆ లింక్‌ను క్లిక్ చేస్తే బీబీసీ వెబ్‌సైట్ అవుతుంది తప్పితే, అందులో ఆ సర్వే సమాచారం ఏదీ కనిపించదన్నవిషయాన్ని గమనించవచ్చు.

వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో బీబీసీ ఎన్నికల సర్వేలంటూ పోస్ట్‌లు కనిపిస్తే నమ్మకండి.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)