ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు?

  • 23 మే 2019
లోకేశ్ Image copyright facebook/lokesh
చిత్రం శీర్షిక చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ వెనుకంజలో ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ప్రభంజనంలో కొందరు టీడీపీ మంత్రులూ కొట్టుకుపోయారు.

ముగ్గురు నలుగురు మినహా మిగిలిన మంత్రులెవరూ విజయం సాధించలేకపోయారు. చంద్రబాబునాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో ఓటమి పాలయ్యారు.

అక్కడ ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజయం సాధించారు.

Image copyright facebook/ganta srinivasarao

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళావెంకటరావుదీ అదే పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.. ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ గెలుపు అందుకున్నారు.

విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించగా.. నర్సీపట్నం నుంచి పోటీ చేసిన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఓటమి పాలయ్యారు.

టెక్కలి నుంచి బరిలోకి దిగిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయం సాధించగా.. మచిలీపట్నం నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్రకు ఓటమి తప్పలేదు.

వీరి పరిస్థితి ఏమిటి?

పేరు గెలుపు/ఓటమి
నారా చంద్రబాబునాయుడు విజయం
కేఈ కృష్ణమూర్తి పోటీ చేయలేదు
నిమ్మకాయల చినరాజప్ప గెలుపు
యనమల రామకృష్ణుడు పోటీ చేయలేదు
నారా లోకేశ్ ఓటమి
కిమిడి కళా వెంకట్రావు ఓటమి
కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపు
సుజయ కృష్ణరంగారావు ఓటమి
చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓటమి
కిడారి శ్రవణ్ కుమార్ ఓటమి
గంటా శ్రీనివాసరావు గెలుపు
కేఎస్ జవహర్ ఓటమి
పితాని సత్యనారాయణ ఓటమి
కొల్లు రవీంద్ర ఓటమి
దేవినేని ఉమా మహేశ్వర రావు ఓటమి
నక్కా ఆనంద్‌ బాబు ఓటమి
సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఓటమి
చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.
భూమా అఖిలప్రియ ఓటమి
కాల్వ శ్రీనివాసులు ఓటమి
పరిటాల సునీత పోటీ చేయలేదు
ఎన్‌. అమర్‌నాథ్‌ రెడ్డి ఓటమి
ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి
నారాయణ ఓటమి

మంత్రుల్లో కేఈ కృష్ణమూర్తి ఈసారి పోటీ చేయలేదు. ఆయన స్థానంలో కుమారుడు శ్యాంబాబు పోటీ చేశారు. ఆయన వెనుకంజలో ఉన్నారు. మంత్రి పరిటాల సునీత కూడా ఈసారి పోటీలో లేరు. ఆమె స్థానంలో పోటీ చేసిన కుమారుడు శ్రీరామ్ కూడా వెనుకంజలోనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)