40,000 తాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే తొలిసారి

  • 23 మే 2019
సెన్సెక్స్, స్టాక్ మార్కెట్లు Image copyright Getty Images

2019 సాధారణ ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాలు స్టాక్ మార్కెట్లను మురిపిస్తున్నాయి.

ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల సరళిలో ఎన్‌డీఏ కూటమి భారీ ఆధిక్యంతో దూసుకుపోతుండటం మదుపర్లలో విశ్వాసం నింపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే సెన్సెక్స్, నిఫ్టీ పనితీరులోనూ ప్రతిబింబిస్తోంది. నేడు 39,590 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక సమయంలో జీవితకాల గరిష్ఠం 40,124 పాయింట్లను తాకింది. 40,000 పాయింట్లను తాకడమనేది సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి. ఇక అటు నిఫ్టీ కూడా 12,041 పాయింట్లను తాకింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు