పయ్యావుల కేశవ్ గెలిస్తే ఏపీలో టీడీపీ ఓడిపోతుందనే ప్రచారంలో నిజమెంత? 1994లో ఏమైంది?

  • 25 మే 2019
పయ్యావుల కేశవ్ Image copyright Facebook

రాయలసీమలో ఆ మాటకొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ ఆసక్తి కలిగించే శాసనసభ నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గెలిస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదనే ప్రచారం ఉంది.

ఇంతకీ ఈ ప్రచాంలో నిజమెంత? ఆయన గెలిస్తే నిజంగా టీడీపీ అధికారంలోకి రాదా? దీనిపై పరిశీలన జరిపితే ఈ ప్రచారం ఆవాస్తవమని తేలింది.

1994లో గెలిచిన కేశవ్... అధికారంలో టీడీపీ

తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత, 1983 నుంచి 2019 వరకు మొత్తం తొమ్మిదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1983, 1985, 1994, 2004, 2009, 2019 ఎన్నికల్లో ఉరవకొండలో టీడీపీ విజయం సాధించింది.

పయ్యావుల కేశవ్ తొలిసారిగా ఉరవకొండ నుంచి 1994 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆ తరువాత పయ్యావుల మూడుసార్లు గెలిచారు.

ఆ మూడు సార్లు టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. 1999, 2014లలో పయ్యావుల ఓటమి పాలవగా ఆ ఏడాది టీడీపీ అధికారంలోకి వచ్చింది.

చరిత్రను గమనిస్తే పయ్యావుల కేశవ్ గెలిస్తే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాదనే ప్రచారం అవాస్తవని తెలుస్తుంది.

టీడీపీ ఏర్పడిన తర్వాత, 1983 నుంచి 2019 వరకు ఉరవకొండ ఫలితం తీరు ఇదీ...
ఎన్నికల సంవత్సరం పయ్యావుల కేశవ్ గెలిచారా, ఓడిపోయారా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ
1994 గెలిచారు టీడీపీ
1999 ఓడిపోయారు టీడీపీ
2004 గెలిచారు కాంగ్రెస్
2009 గెలిచారు కాంగ్రెస్
2014 ఓడిపోయారు టీడీపీ
2019 గెలిచారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)