జగన్ ప్రెస్ మీట్: 'నేను ఉన్నా.. నేను విన్నా.. అని మరోసారి హామీ ఇస్తున్నా'

  • 23 మే 2019
జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు.

ఇంత భారీ మెజార్టీ రావడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అయ్యుంటుందని జగన్ అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...

  1. దేశ చరిత్రలోనే ఇది గొప్ప విజయం
  2. మొత్తం ఎంపీ స్థానాలు 25 రావడం, 175 నియోజకవర్గాలలో 151 రావడం రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం.
  3. ఈ విజయం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో సాధ్యమైంది.
  4. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతలను, విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది.
  5. ఇది ప్రజలు విశ్వసనీయతకు వేసిన ఓటు.
  6. విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పారు.
  7. అయిదు కోట్ల మంది ప్రజల్లో దేవుడు ఒక్కరికి ఇస్తాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. ఆ అవకాశం మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది.
  8. ఆ అవకాశం ఒక్కరికి వచ్చినప్పుడు... గవర్నమెంటు అంటే ఏమిటి, గొప్ప గవర్నెన్స్ అంటే ఏమిటో చూపిస్తాను.
  9. జగన్ అందరికన్నా మంచి ముఖ్యమంత్రిగా మీ అందరితో మన్ననలు అందుకుంటానని మనవి చేస్తున్నా.
  10. ఈ సందర్భంగా ప్రజలందరికీ రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
  11. ఆరు నెలల నుంచి ఏడాది లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటానని మాటిస్తున్నా.
  12. ఈనెల 30న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)