మోదీ భారీ విజయం.. ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మోదీ భారీ విజయం.. ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

  • 28 మే 2019

నరేంద్రమోదీ మరోసారి భారీ మెజారిటీతో గెలిచారు.

జాతీయవాదం, అభివృద్ధి సమ్మేళనంతో ఆయన చేసిన ప్రచారం ఎన్నికలను స్వీప్ చేసింది. గత ఎన్నికల కన్నా పెద్ద విజయాన్ని అందించింది.

ఈ ఎన్నికల పోరు భారతదేశ లౌకిక గుర్తింపు కోసం జరుగుతున్న పోరుగా చాలా మంది పరిగణించారు.

దేశంలో గత ఐదేళ్లలో హిందూ జాతీయవాదం పెరిగింది. దేశంలోని మైనారిటీల మీద దాడులు పెరిగాయి. గోవధ ఆరోపణలతో డజన్ల సంఖ్యలో ముస్లింలను కొట్టి చంపారు.

దేశంలో మెజారిటీ అయిన హిందువుల్లో చాలా మంది గోవును పూజిస్తారు.

ఇప్పుడు మైనారిటీల పరిస్థితి ఇంకా దిగజారుతుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కానీ తాము మైనారిటీ వ్యతిరేకులం కామని పార్టీ నేతలు అంటున్నారు. 'బలమైన, సమ్మిళత భారత్' నిర్మిస్తానని గెలిచిన తర్వాత మోదీ స్వయంగా చెప్పారు.

సమాజాన్ని విభజించే వ్యక్తిగా మోదీని కొందరు చూస్తారు. కానీ 'నవీన భారత్' అనే ఆయన విజన్‌ను చాలా మంది నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)