ఎన్టీఆర్ గురించి ఈ పది విషయాలు మీకు తెలుసా?

  • 28 మే 2019
నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ Image copyright facebook/TDP.Official

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 97వ జయంతి నేడు. 1923 మే 28వ తేదీన ఆయన జన్మించారు.

ఆయన గురించి ఒక పది విషయాలు..

1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డుగా ఆయన అభివర్ణిస్తారు.

Image copyright facebook/TDP.Official

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన తర్వాత సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ చేతిలో ఉండేది. ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి.

Image copyright facebook/TDP.Official

1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు.

Image copyright facebook/TDP.Official

40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు.

Image copyright facebook/TDP.Official

ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు.

Image copyright facebook/TDP.Official
చిత్రం శీర్షిక నందమూరి జయకృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణలతో ఎన్టీఆర్

దేవాలయాలలో పూజారి వృత్తికి మొదటిసారి బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం వచ్చేలా పరీక్ష ద్వారా పదవులను భర్తీ చేయించిన ఘనత ఎన్టీఆర్ ది.

Image copyright facebook/jrntr
చిత్రం శీర్షిక జూనియర్ ఎన్టీఆర్‌తో సీనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారoట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టారు.

Image copyright facebook/TDP.Official

'శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే… ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తరువాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు.

Image copyright facebook/TDP.Official

1987 హర్యానా ఎన్నికల్లో దేవీ లాల్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ దారిన వెళ్లారు. ఆనూహ్యంగా దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్య మంత్రి కూడా అయ్యారు.

Image copyright facebook/TDP.Official
చిత్రం శీర్షిక పీవీ నరసింహారావుతో ఎన్టీఆర్

తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు, ఎన్టీఆరే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారు.

Image copyright facebook/TDP.Official

ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.

అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగారు కూడా.

దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. "మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను" అన్నారట..

అవతలివారు ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారట ఎన్టీఆర్. సినిమాల్లో తీసే అడ్వెంచర్స్, ఫైటింగుల వల్ల, ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ కుడిచెయ్యి నాలుగు సార్లు విరిగింది. వరుస ప్రమాదాలతో కుడిచేయి పట్టు తప్పడంతో ఎడమచేత్తోనే దీవెనలు ఇవ్వడం ప్రారంభించారట ఎన్టీఆర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)