మోదీ కేబినెట్: కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి.. హోంమంత్రిగా అమిత్ షా

  • 31 మే 2019
అమిత్ షా Image copyright Pib

ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు హోం శాఖను కేటాయించారు.

గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు ఈసారి ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి లభించింది.

Image copyright facebook/kishanreddy
చిత్రం శీర్షిక కిషన్ రెడ్డి

మోదీ కేబినెట్‌లోని మంత్రులు

పేరు మంత్రిత్వ శాఖ
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి
అమిత్ షా హోం
రాజ్‌నాథ్ సింగ్ రక్షణ
నిర్మలా సీతారామన్ ఆర్ధిక
నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు
సదానంద గౌడ ఎరువులు రసాయనాలు
పీయూష్ గోయెల్ రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు
ప్రహ్లాద్‌ జోషీ పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ
రమేశ్‌ పోఖ్రియాల్‌ మానవ వనరులు
నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ, గ్రామీణ,పంచాయితీ
రాం విలాస్ పాశ్వన్ వినయోగదారులు వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరా
రవిశంకర్ ప్రసాద్ న్యాయ, కమ్యూనికేషన్, ఐటీ
హరిసిమ్రాత్ కౌర్ బాదల్ ఫుడ్ ప్రాసెసింగ్
థావర్‌ చంద్‌ గహ్లోత్‌ సామాజిక న్యాయం, సాధికారత
అర్జున్‌ ముందా గిరిజన సంక్షేమం
స్మృతి ఇరానీ స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి
హర్షవర్ధన్‌ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ప్రకాశ్‌ జావడేకర్‌ పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార
ఎస్‌.జయశంకర్‌ విదేశాంగ వ్యవహారాలు
ధర్మేంద్ర ప్రదాన్‌ పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమలు
మహేంద్రనాథ్‌ పాండే నైపుణ్యాభివృద్ధి శాఖ
అరవింద్‌ గణపత్‌ సావంత్‌ భారీ పరిశ్రమలు
గిరిరాజ్‌ సింగ్‌ పాడి, పశుగణాభివృద్ధి, మత్య్స
ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మైనార్టీ సంక్షేమం
గజేంద్ర సింగ్ షెకావత్ జల శక్తి

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

పేరు మంత్రిత్వ శాఖ
సంతోష్‌ కుమార్‌ గాంగ్వర్‌ శ్రామిక, ఉపాధి కల్పన
ఇంద్రజీత్‌ సింగ్‌ ప్రణాళిక, గణాంక
శ్రీపాద యశోనాయక్‌ ఆయుష్‌, రక్షణ
జితేంద్ర సింగ్‌ ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధాన మంత్రి కార్యాలయం సహాయ
కిరణ్‌ రిజిజూ క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు
ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సాంస్కృతిక, పర్యాటక
రాజ్‌ కుమార్‌ సింగ్‌ విద్యుత్‌, సంప్రదాయేతర విద్యుత్‌, నైపుణ్యాభివృద్ధి
హర్‌దీప్‌ సింగ్‌ పూరి గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమలు
మన్‌సుఖ్‌ మాండవీయ షిప్పింగ్‌

సహాయ మంత్రులు

పేరు మంత్రిత్వ శాఖ
ఫగ్గన్ సింగ్ కులస్తే ఇనుము, ఉక్కు పరిశ్రమ
అశ్విని కుమార్ చౌబే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
అర్జున్ రాం మెఘవాల్ పార్లమెంటరీ వ్యవహరాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు
జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
క్రిషన్ పాల్ సామాజిక న్యాయం, సాధికారత
దన్వే రావుసాహెబ్ దాదారావు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ
కిషన్ రెడ్డి హోం
ప్రశోత్తం రూపాల వ్యవసాయం, రైతు సంక్షేమ
రాందాస్ అథ్వాలే సామాజిక న్యాయ, సాధికారత
నిరంజన్ జ్యోతి గ్రామీణ అభివృద్ధి
బబుల్ సుప్రియో పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు
సంజీవ్ కుమార్ బల్యాన్ పశుసంవర్ధక, పాడి, మత్య్స పరిశ్రమలు
సంజయ్ శ్యాంరావు ధోట్రే మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీ
అనురాగ్ సింగ్ ఠాకుర్ ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాలు
సురేశ్ చెన్నబసప రైల్వే
నిత్యానంద్ రాయి హోం
రతన్ లాల్ కటారియా జల శక్తి
మురళీధరన్ విదేశీ, పార్లమెంటరీ వ్యవహరాలు
రేణుకా సింగ్ గిరిజన వ్యవహారాలు
సోంప్రకాశ్ వాణిజ్యం, పరిశ్రమలు
రామేశ్వర్ తేలి ఫుడ్ ప్రాసెసింగ్
ప్రతాప్ చంద్ర సారంగి చిన్న,సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, పశుసంవర్ధక, పాడి, మత్య్స పరిశ్రమలు
కైలాశ్ చౌధురి వ్యవసాయ, రైతు సంక్షేమం
దేబశ్రీ చౌధురి మహిళ, శిశు సంక్షేమ

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం