జనగామలో జలాశయంలో దిగిన ముగ్గురు మృతి

  • 1 జూన్ 2019
జనగామ Image copyright UGC

జనగామ జిల్లాలో బొమ్మకూరు జలాశయంలో నీట మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

మృతులను రఘునాథపల్లి మండలం గిద్దబండ తండాకు చెందిన అభిలాష్‌ (25), సంగీత (19), సుమలత (15)లుగా అధికారులు గుర్తించారు.

శనివారం మధ్యాహ్నం అభిలాష్ తన భార్య దివ్య, సమీప బంధువులు సంగీత, సుమలతలతో కలిసి బొమ్మకూరు జలాశయానికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

అభిలాష్, సంగీత, సుమలత నీటిలోకి దిగగా, వీరిని దివ్య గట్టుపై నిల్చొని ఫోన్‌లో వీడియో తీస్తూ ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. అయితే, ఆ ముగ్గురూ ఒక్కసారిగా లోపలున్న గుంతలో పడి, నీటిలో మునిగిపోయారని వివరించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంత మంది స్థానిక ఈతగాళ్లు జలాశయంలో గాలించి ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.

దివ్య తీసిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు