ఈ మహిళలు రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు

  • 4 జూన్ 2019
గణేషా గావ్‌లోని నీటి బావి

అది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా. ఆ జిల్లాలోని త్రయంబకేశ్వర్ ప్రాంతంలో వర్షాలు బాగానే కురుస్తాయి. కానీ ఏటా వేసవిలో, నీటి చుక్క కోసం ఈ ప్రాంతం దాహంతో అలమటిస్తుంది. ఇక్కడి గిరిజన ప్రాంత మహిళలు పగలు, రాత్రి తేడా లేకుండా నీటి కోసం వేట సాగిస్తారు. అందుకు గనేషాగావ్ గ్రామం ఒక ఉదాహరణ. ఈ గ్రామ మహిళలు, నీటి కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

''నీటి సమస్యతో ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాం. పొద్దున లేచింది మొదలు నీటి గురించే మా ఆలోచనంతా. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏ వైపు వెళ్తే నీరు దొరుకుతుందా.. అని ఆలోచిస్తుంటాం. మా పిల్లల్ని ఇంట్లోనే నిద్రపొమ్మని చెప్పి మేం నీటి కోసం వెతుకుతూ బయలుదేరతాం. ఎవరైనా తోడు వస్తే మంచిదే. లేకపోతే ఒంటరిగా మైళ్ల దూరం నడవాల్సి వస్తుంది. ఒక రోజు నీళ్లు దొరికితే, ఇంకోరోజు దొరకవు. మా ఊరికి నీళ్ల ట్యాంకర్లు వస్తాయి కానీ, అవి బురదనీళ్లు. మా ఊళ్లో 40-50 బావులు ఉన్నాయి. కానీ అన్నీ ఎండిపోయాయి. ఎందులోనూ నీళ్లు లేవు'' అని మంగళా బాయి అనే మహిళ బీబీసీకి వివరించారు.

ఈ మహిళలు నీటి కోసం సుమారు 2 నుంచి 4 కిలోమీటర్లు నడుస్తారు. ఆపై బరువైన నీటి బిందెలను తలపై మోసుకుంటూ రావడం వల్ల శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీరు బీబీసీతో పంచుకున్న మరిన్ని విషయాలను ఈ కింది వీడియోలో చూడండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు

''ఉదయం 6 గంటల నుంచి నీటి కోసం వెతుకులాట మొదలవుతుంది. బావిలో కేవలం ఐదారు బిందెల నీరు మాత్రమే ఉంటుంది. ఎవరైనా వాటిని తోడుకొని వెళ్లిపోతే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? అందుకే మేమంతా రెండేసి బిందెల నీళ్లు పంచుకుంటాం. ఆ రెండు బిందెల కోసం మేం మూడు మైళ్లు నడవాల్సి ఉంటుంది. రెండు బిందెల్నీ ఒకేసారి మోసుకుంటూ రావడం వల్ల ఛాతి నొప్పి, నడుము నొప్పి వస్తాయి'' అని తుల్సాబాయి అనే మరో మహిళ అన్నారు.

నాసిక్‌లోని కొన్ని ప్రాంతాలు వర్షాలు పడ్డాక కూడా కరవును ఎదుర్కొంటున్నాయి.

''నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కానీ వచ్చే వాన నీటిని తగిన విధంగా నిల్వ చేసి, జాగ్రత్త పరచుకోవాలి. వాళ్లేమో నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చెయ్యమంటారు. కానీ అందుకోసం చెయ్యాల్సిన పనుల్ని పూర్తి చెయ్యరు. అలా అయితే నీరు భూమిలోకి ఎలా ఇంకుతుంది, నీటిని నిల్వ చెయ్యడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఇక్కడ కరవు సంభవిస్తోంది. సురక్షితమైన తాగు నీరన్నది ఏటా సమస్యగా మారింది'' అని గణేషాగావ్ పోలీస్ ప్రతినిధి పాటిల్ దేవ్‌చంద్ మహాలే అన్నారు.

ఏటా ఎన్నికల్లో హామీలకు కొదవ లేదు కానీ, ఏ ఒక్క నేత కూడా తమ సమస్యను పరిష్కరించడం లేదని వీరు చెబుతున్నారు.

నాసిక్ పరిధిలోని 8 మండలాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నాసిక్ ప్రాంతంలోని 1069 గ్రామాలకు కేవలం 325 ట్యాంకర్లు మాత్రమే దాహం తీరుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా

హిమాచల్ వర్షాలు: 24 గంటల్లో 22 మంది మృతి; చిక్కుకుపోయిన మంత్రి హెలికాప్టర్లో సిమ్లాకు తరలింపు

చిదంబరం బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు

సిక్కిం: సున్నా నుంచి 10కి చేరిన బీజేపీ బలం.. ఫిరాయింపు చట్టం వర్తించదంటున్న రాంమాధవ్

విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా

’అణ్వస్త్ర’ క్షిపణిని పరీక్షించిన అమెరికా.. సైనిక ఉద్రిక్తతలను పెంచుతోందన్న రష్యా

అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్

సిరియా యుద్ధం ఈ బాలుడి ముఖాన్ని మార్చేసింది