రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు

  • 4 జూన్ 2019

అది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా. ఆ జిల్లాలోని త్రయంబకేశ్వర్ ప్రాంతంలో వర్షాలు బాగానే కురుస్తాయి. కానీ ప్రతి ఏడాది వేసవిలో, నీటి చుక్క కోసం ఈ ప్రాంతం దాహంతో అలమటిస్తుంది. ఇక్కడి గిరిజన ప్రాంత మహిళలు పగలు, రాత్రి తేడా లేకుండా నీటి కోసం వేట సాగిస్తారు. అందుకు గనేషాగావ్ గ్రామం ఒక ఉదాహరణ. ఈ గ్రామ మహిళలు, నీటి కోసం తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

''నీటి సమస్యతో ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాం. పొద్దున లేచింది మొదలు నీటి గురించే మా ఆలోచనంతా. తెల్లవారు 3 గంటల నుంచి, ఏ వైపు వెళ్తే నీరు దొరుకుతుందా.. అని ఆలోచిస్తుంటాం. మా పిల్లల్ని ఇంట్లోనే నిద్రపొమ్మని చెప్పి మేం నీటి కోసం వెతుకుతూ బయలుదేరతాం. ఎవరైనా తోడు వస్తే మంచిదే. లేకపోతే ఒంటరిగా మైళ్ల దూరం నడవాల్సి వస్తుంది. ఒక రోజు నీళ్లు దొరికితే, ఇంకోరోజు దొరకవు. మా ఊరికి నీళ్ల ట్యాంకర్లు వస్తాయి కానీ, అవి బురదనీళ్లు. మా ఊళ్లో 40-50 బావులు ఉన్నాయి. కానీ అన్నీ ఎండిపోయాయి. ఎందులోనూ నీళ్లు లేవు'' అని మంగళా బాయి అనే మహిళ బీబీసీకి వివరించారు.

ఈ మహిళలు నీటి కోసం సుమారు 2 నుంచి 4 కిలోమీటర్లు నడుస్తారు. ఆపై బరువైన నీటి బిందెలను తలపై మోసుకుంటూ రావడం వల్ల శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీరు బీబీసీతో పంచుకున్న మరిన్ని విషయాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)