మహారాాష్ట్ర కరవు కష్టాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కరవుకు భయపడి, వీరు సొంత ఊళ్లకు పోవడం లేదు

  • 6 జూన్ 2019

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ప్రతి వేసవిలోనూ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఈ ఏడాది కూడా రుతుపవనాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాల మధ్య ఇక్కడి చాలా గ్రామాలు ఇప్పటికే కరవుతో విలవిలలాడుతున్నాయి.

మహారాష్ట్ర వలస కూలీల జీవితంపై బీబీసీ ప్రతినిధి రాహుల్ రణ్ సుభే అందిస్తున్న కథనం..

''1972 నాటి కరవు చాలా తీవ్రమైంది. మేం దాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పడూ మేం కరవులోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఈసారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది'' అని భివారాబాయి గంగే అనే మహిళ అన్నారు.

బారామతిలోని చెక్కెర కర్మాగారాల పని సీజన్‌ ముగిసింది. అయితే చెరకు కోతల పనుల కోసం ఇక్కడికి వచ్చిన కూలీలు మాత్రం ఇంకా వెనక్కి వెళ్లలేదు. మరాఠ్వాడాలో నెలకొన్న తీవ్రమైన కరవు కారణంగా వీరు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.

''గత 70 ఏళ్లుగా మేం ఇక్కడికి వస్తున్నాం. మాది బీడ్ జిల్లా, ఆష్టీ తాలూకాలోని గాంగేవాడి గ్రామం. మా పిల్లలను కలవడానికి నేనిక్కడికి వచ్చాను. గతంలో నేను కూడా చెరకు కోత పనులకు వచ్చేదాన్ని. అదే పని ఇప్పుడు నా పిల్లలు చేస్తున్నారు. ఏం చెయ్యాలి? మేం పేద వాళ్లం. మాకున్న భూమి చాలా తక్కువ. నీటి సదుపాయం లేదు. ఈసారి మేం ఘోరమైన కరవును చవి చూస్తున్నాం'' అని వలస వచ్చిన తన పిల్లలను చూడటానికి బారామతి వచ్చిన భివారాబాయి గంగే అన్నారు.

మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)