రీనో ఆదివాసీ తెగలో మహిళలదే అధికారం.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

రీనో ఆదివాసీ తెగలో మహిళలదే అధికారం

  • 11 జూన్ 2019

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నివసించే రీనో ఆదవాసీ తెగకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వారి ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు చాలా విభిన్నం.

ప్రధాన స్రవంతిలోని ప్రజలు రీనోలను 'బోండాలు’ అని పిలుస్తుంటారు. సాధారణ వ్యవహారంలో 'బోండా' అంటే 'బండోడు' అనే అర్థం ఉంది.

ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో రీనోలు ఎక్కువగా ఉంటారు. వీరు మాట్లాడే భాష బోండీ.

మల్కన్ గిరిలోని ఒనకడిల్లీలో ప్రతి గురువారం జరిగే సంతకు వచ్చి తమ దగ్గరున్న కొండ చీపుర్లను, ఇతర వస్తువులను అమ్ముకొని, కావాల్సిన వస్తువులను కొనుక్కుంటారు. వీరి వేషధారణ, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకొనేందుకు పర్యాటకులు ఒనకడిల్లీ సంతకు వస్తుంటారు.

రీనోల జీవన విధానం గురించి తెలుసుకోవడానికి వీరు నివసించే కతం గూడ గ్రామాన్ని, ఒనకడిల్లీ సంతను బీబీసీ బృందం సందర్శించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)