NEFT, RTGS నగదు బదిలీలపై జూలై 1 నుంచి ఛార్జీలు ఉండవు - ఆర్బీఐ

  • 11 జూన్ 2019
రూపాయి గుర్తు చూపుతున్న వ్యక్తి Image copyright Getty Images

జూలై 1వ తేదీ నుంచి ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా జరిపే నగదు బదిలీలపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.

ఈ మేరకు ఈరోజు (జూన్ 11వ తేదీ మంగళవారం) బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది.

జాతీయ ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ (ఎన్‌ఈఎఫ్‌టీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) సేవలను ఉపయోగించుకుని నగదు బదిలీ జరిపితే ఇప్పటి వరకూ ఆయా బ్యాంకుల నుంచి ఆర్బీఐ కొంత రుసుము వసూలు చేస్తోంది.

అయితే, 2006లో ప్రవేశపెట్టిన సేవల ఈ వ్యవస్థ, రుసుము చెల్లింపులపై కొన్ని బ్యాంకులు గత కొద్ది సంవత్సరాలుగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి.

Image copyright RBI

ఆర్టీజీఎస్ ద్వారా రూ. 5 లక్షల వరకూ నగదు పంపితే ఒక్కో బదిలీపై గరిష్ఠంగా రూ.30, రూ.5 లక్షల కంటే మించి నగదు పంపితే గరిష్ఠంగా ఒక్కో బదిలీపై రూ.55 వసూలు చేస్తున్నారు.

నగదును బదిలీ చేస్తున్న బ్యాంకు ఈ రుసుమును ఖాతాదారుడి నుంచి వసూలు చేస్తోంది.

కానీ, నగదును స్వీకరించిన బ్యాంకుకు కానీ, ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ వ్యవస్థలను నిర్వహించే సంస్థలకు కానీ ఈ రుసుము నుంచి చెల్లించాల్సిన నిర్వహణ వ్యయాలను అందించటం లేదని తమకు ఫిర్యాదులు అందాయని ఆర్బీఐ తెలిపింది.

ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన జరిగిన సమావేశంలో ఈ సేవల ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములను ఎత్తివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.

Image copyright Getty Images

ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీలు బాగా పెరిగాయని, ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీలు, చెల్లింపులకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసేందుకు గాను ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ సేవలపై విధిస్తున్న రుసుములను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

తాము కల్పించిన ఈ ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదిలీ చేయాలని, అన్ని బ్యాంకులు జూలై 1వ తేదీ నుంచి ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా నగదు బదిలీలు జరిపే ఖాతాదారుల నుంచి కూడా ఎలాంటి రుసుములూ వసూలు చేయొద్దని ఆర్బీఐ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లో ఫొటోలు ఇప్పటివేనా?

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన ఐసీజే

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...