వడోదర: సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఏడుగురు మృతి

  • 16 జూన్ 2019
సఫాయి కార్మికులు మృతి Image copyright AFP

గుజరాత్‌లోని ఒక హోటల్ ప్రాంగణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.

మృతుల్లో నలుగురు సఫాయి కార్మికులు, ముగ్గురు హోటల్ సిబ్బంది ఉన్నారు. ఏడుగురు సెప్టిక్ ట్యాంకులోకి దిగగానే అందులోని విషవాయువులను పీల్చడంతో ఊపిరాడక వారు మరణించారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన వడోదర జిల్లాలోని దభోయి పట్టణంలో ఉన్న దర్శన్ హోటల్‌లో శుక్రవారం జరిగింది. హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

"ముందుగా ఒక కార్మికుడు సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. కానీ, లోపలికి దిగాక అతని నుంచి ఉలుకూ పలుకూ లేదు. బయట ఉన్నవారు పిలిచినా స్పందించడంలేదు. దాంతో, అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు మరో ముగ్గురు కార్మికులు కూడా దిగారు. వారు కూడా లోపలికి వెళ్లాక స్పందించలేదు. వారికి సాయం చేసేందుకు ముగ్గురు హోటల్ సిబ్బంది దిగగా వారు కూడా స్పృహ కోల్పోయి చనిపోయారు" అని పోలీసులు తెలిపారు.

చిత్రం శీర్షిక దిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో మురికి కాల్వను శుభ్రం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రిషిపాల్

ఏడుగురు లోపలికి దిగి స్పృహ కోల్పోయారని గుర్తించిన హోటల్ నిర్వాహకులు అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించారు. దాంతో, సహాయక సిబ్బంది ఏడు మృతదేహాలను బయటకు తీశారు.

"సెప్టిక్ ట్యాంకులో విషవాయువులకు తట్టుకోలేక ఏడుగురు చనిపోయారు" అని అగ్నిమాపక విభాగం అధికారి నికుంజ్ ఆజాద్ చెప్పారు.

గతేడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, మొరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర హేచరీస్ (కోళ్ల ఫారం)లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు.

మ్యానువల్ స్కావెంజింగ్ (చేతితో మలాన్ని తొలగించడం)ను నిర్మూలించేందుకు 'సఫాయీ కర్మచారి ఆందోళన్' సంస్థ పోరాడుతోంది. మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ ఊపిరాడక గత పదేళ్లలో దాదాపు 1,800 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఈ సంస్థ చెబుతోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: చిత్తూరులో సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే

టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది

బోరిస్ జాన్సన్: బ్రిటన్‌కు కొత్త ప్రధానమంత్రి

కశ్మీర్ వివాదంపై ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మోదీ కోరలేదు: భారత్

ఇరాన్ సీజ్ చేసిన నౌకలోని 18 మంది భారతీయుల పరిస్థితి ఏమిటి

అమెరికాతో దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు పాక్ ప్రయాస

ఒకప్పుడు ఆయన్ను పిచ్చోడన్నారు.. ఇప్పుడు తెలంగాణ స్కూళ్లలో ఆయనపై పాఠాలు చెబుతున్నారు