శాండ్ విచ్ జనరేషన్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: శాండ్‌విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?

  • 19 జూన్ 2019

30-50 ఏళ్ల మధ్య వయసుండి.. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు పిల్లల బాధ్యత కలిగినవారే శాండ్‌విచ్ జనరేషన్ అంటే! ఈ జనరేషన్ వ్యక్తుల జీవితం ఎలా ఉంది? బీబీసీ.. శాండ్‌విచ్ జనరేషన్‌కు చెందిన కొందరు మహిళలను పలకరించింది. ఆఫీస్ పనులు, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతల మధ్య నలిగిపోతున్నామని వారు చెబుతున్నారు.

‘‘మీరు చెబుతున్నట్లే, మేం శాండ్‌విచ్ అవుతున్నాం. ఒకవైపు ఆఫీసు, మరోవైపు పిల్లలు, అత్తమామలు. పనులు చక్కబెట్టాలంటే కష్టపడటం మాత్రమే కాదు కదా, వారితో కాస్త సమయం గడపాలి. లేకపోతే వారిని నిర్లక్ష్యం చేస్తున్నామని భావిస్తారు’’ అని 34 ఏళ్ల దీపా జోషి అన్నారు.

హెల్ప్ ఏజ్ ఇండియా సర్వే ప్రకారం, తల్లిదండ్రులను చూసుకుంటున్నవారిలో 29% మంది, ఆ బాధ్యతలను భారంగా ఫీల్ అవుతున్నారు. దేశంలోని 20 నగరాల్లో ఈ సర్వే చేశారు.

మరి ఇలాంటి బాధ్యతల నడుమ నలిగిపోతున్నామని మహిళలు చెబుతోంటే, పిల్లలు, మహిళల తల్లిదండ్రులు ఏమంటున్నారో, ఆ మహిళల జీవితాలను మూడు కోణాలనుంచి తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు