వీడియో: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు.. గుజరాత్ ముస్లిం మహిళల యోగా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు.. గుజరాత్ ముస్లిం మహిళల యోగా

  • 21 జూన్ 2019

ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ముస్లిం మహిళలు ఇప్పుడు యోగా చేస్తున్నారు. అంతే కాదు.. యోగాను తమదైన శైలిలో చేస్తూ అందరి చేతా శెభాష్ అనిపించుకుంటున్నారు.

భారత దేశంలో యోగాను హిందూమత ఆధ్యాత్మిక వ్యాయామంగానే చూస్తుంటారు.

యోగా సాధన చేయడం ముస్లింల సంప్రదాయంలో లేదు.

కానీ ఈ మహిళలు ఆ భావనను మార్చాలనుకుంటున్నారు.

యోగా వల్ల కలిగే ప్రయోజనాలను, ఫలితాలను ఈ మహిళలు స్వయంగా తెలుసుకున్నారు.

‘‘గతంలో నాకు భుజాల నొప్పితో పాటుగా ఒళ్లంతా నొప్పులు ఉండేవి. యోగా చేయడం మొదలు పెట్టాక ఆ నొప్పుల నుంచి ఉపశమనం కలిగింది’’ అని హసనబు సూర్తి చెప్పారు.

‘‘మేం మొదటిసారి యోగా నిర్వహించినప్పుడు అల్లాను స్తుతించే 99 పవిత్ర నామాలను యోగా ముద్రలతో మిళితం చేస్తామని చెప్పాం’’ అని తద్బీర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలైన నాషెతాభాయ్ సాహెబ్ తెలిపారు.

‘‘అల్లా పవిత్ర నామాలను స్తుతించడం మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది.’ అని షెహ్వార్ మోతీవాలా వెల్లడించారు.

ఈ మహిళలంతా గుజరాత్‌లోని ‘అలావి బోహ్రా’ అనే ముస్లిం తెగకు చెందినవారు.

ఇది ఇస్లాంలో ఒక ఉపతెగ. వీరి సంప్రదాయం ప్రయాకం మహిళలంతా తమ ఇళ్లకే పరిమితం అవుతారు.

యోగా చేయడం మొదలు పెట్టింది మాత్రం ఈ తెగలోని పురుషులే.

‘‘మసీదుల్లో చాలామంది కుర్చీల్లో కూర్చుని నమాజు చేస్తున్నారు. కానీ, 15 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఈ మార్పును స్వాగతించకూడదు. మన ఆరోగ్య సమస్యలకు జీవనశైలే కారణం. ఇస్లామిక్ యోగాను సాధన చేయడమే ఇందుకు సరైన పరిష్కారం’’ అని హోమియోపతి వైద్యులు జుల్కర్నియాన్ హకీముద్దీన్ చెప్పారు.

వాస్తవానికి ఈ ముస్లిం మహిళలు మొదట కోరుకున్నది ఒక ఆధ్యాత్మిక ఆసరా.

‘‘మనుషుల విశ్వాసాలు వారి హృదయంతో ముడిపడి ఉంటాయి. ఆ విశ్వాసాలను కొనసాగిస్తే, వారి నమ్మకాలకు మించి ఎన్నో అంశాలు వారికి సత్ఫలితాలను ఇస్తాయి. ప్రవక్త చెప్పినట్టుగా.. పవిత్రమైన దానిని స్వీకరించు, అపవిత్రమైన విషయాన్ని తిరస్కరించు’’ అని అలావి బోహ్రా శాఖాధిపతి సయ్యెద్‌నా హాతిమ్ జకియుద్దీన్ సాహెబ్ అభిప్రాయపడ్డారు.

ఈ పరిణామాలతో ఇక యోగా చేయడానికి తమకు అనుమతి లభించినట్టేనని ఈ ముస్లిం మహిళలు భావించారు.

యోగా వల్ల కలిగే ప్రయోజనాలను తాము స్వయంగా అనుభవిస్తున్నామని వీరు చెబుతున్నారు.

యోగా అన్నది అసలు సిసలైన హిందీ పదం. యోగా అంటే ‘ఐక్యం చేయడం’ అని అర్థం.

ఈ ముస్లిం మహిళల విషయంలో వారి ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకూ మధ్య ఐక్యత కుదిరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)