ఎయిరిండియా విమానానికి 'బెదరింపులు'... లండన్‌లో అత్యవసర ల్యాండింగ్

  • 27 జూన్ 2019
ఎయిరిండియా Image copyright Alamy
చిత్రం శీర్షిక అత్యంత వేగంగా దూసుకువెళ్ళిన టైఫూన్ జెట్ (పైన) రక్షణలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమానం

ఎయిరిండియా ప్రయాణికుల విమానం అత్యవసర పరిస్థితుల్లో 'ముందస్తు జాగ్రత్త'గా లండన్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో దిగింది. అయితే, అంతకుముందు ఎయిరిండియా 'బాంబు బెదరింపు' వల్ల అలా చేయాల్సి వచ్చిందని ప్రకటించింది.

ముంబయ్ నుంచి నెవార్క్‌కు బయలుదేరిన ఏఐ191 ఈ విమానాన్ని ల్యాండ్ చేస్తున్నప్పుడు భద్రత కోసం ఆర్ఏఎఫ్ టైఫూన్ విమానాలు అనుసరించాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Image copyright Twitter

బాంబు బెదరింపులు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఎయిరిండియా మొదట ట్వీట్ చేసింది. కానీ, ఆ తరువాత ఆ ట్వీట్‌ను తొలగించింది. బాంబు బెదరింపు అన్నది గాలివార్త అని ఎయిరిండియా అధికారి ఒకరు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో అన్నారు.

లండన్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయం ఒక ప్రకటన చేస్తూ ఎయిరిండియా విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ అయిందని, ప్రధాన టర్మినల్‌కు దూరంగా ప్రత్యేకంగా దానిని నిలిపి ఉంచినట్లు తెలిపింది.

ఆ విమానంలో 327 మంది ప్రయాణికులున్నారని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. విమానం లండన్ టైమ్ ప్రకారం రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని కూడా వెల్లడించారు.

Image copyright PA
చిత్రం శీర్షిక స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్ట్

@డినోగోయెల్ అనే ప్రయాణికుడు, విమానంలోని ప్రయాణికులందరినీ ఒక్కొక్కరిగా తనిఖీ చేసి, వారి బ్యాగులను పరిశీలించి, స్నిఫర్ డాగ్స్‌కు చూపించి కిందకు దింపారని ట్వీట్ చేశారు.

ఆ తరువాత వారందరినీ బస్సులోకి ఎక్కించి టర్మినల్‌కు తీసుకువచ్చి, ఫలహారాలు, టీ, కాఫీలు అందించారని ఆయన తెలిపారు.

ఆయన తన ట్వీట్‌లో ఇంకా, "ప్రయాణికులందరూ ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నారు, భద్రతా సమస్యలు ఏవో వచ్చాయని అర్థం చేసుకున్నారు" అని చెప్పారు.

లండన్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయం ఒక ప్రకటన చేస్తూ ఎయిరిండియా విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ అయిందని, ప్రధాన టర్మినల్‌కు దూరంగా ప్రత్యేకంగా దానిని నిలిపి ఉంచినట్లు తెలిపింది.

లింకన్‌షైర్‌లోని కానింగ్స్‌బీ నుంచి టైఫూన్ జెట్లను ఎయిరిండియా విమానానికి రక్షణగా పంపించామని ఆర్ఏఎఫ్ అధికారు ఒకరు తెలిపారు.

ఈ ప్రాంతంలో అవి సూపర్‌సానిక్ వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, వాటి శబ్దం భీకర మేఘ గర్జనలా ఉంటుందని ఆయన చెప్పారు.

బీబీసీ ప్రతినిధి సురంజనా తివారీతో మాట్లాడిన హీత్రూ ఎయిర్ పోర్ట్‌లోని ఎయిరిండియా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దేబాశిష్ గోల్డర్ ఒక ప్రయాణికుల విమానాన్ని భద్రతా కారణాలతో దారి మళ్లించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా