కేంద్ర బడ్జెట్: 2022 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు.. వద్దనుకుంటే తప్ప

  • 5 జూలై 2019
గ్యాస్ సిలీండర్ల బండి Image copyright Getty Images

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2019-20 బడ్జెట్ ప్రసంగంలో 2022 నాటికి భారతదేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఎవరైనా వద్దనుకుంటే తప్ప కనెక్షన్లు లేని ఇల్లు అంటూ ఉండదని అన్నారు.

2018 నవంబరు నాటికి దేశంలో 89శాతం కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

మొత్తం గ్యాస్ కనెక్షన్లు: 24.90 కోట్లు

సబ్సిడీ కనెక్షన్లు: 22.90 కోట్లు

రెండు సిలీండర్లు ఉన్న కనెక్షన్లు: 11.90 కోట్లు

గ్రామాల్లోని కనెక్షన్లు: 11.30 కోట్లు

పట్టణ కనెక్షన్లు: 13.60 కోట్లు

వాణిజ్య కనెక్షన్లు: 29 లక్షలు

ఆధారం: 2018, నవంబరు వినియోగదారుల గణాంకాలు

Image copyright Getty Images

'సౌభాగ్య' వెబ్‌సైట్ ప్రకారం 2019 జులై 05 నాటికి భారతదేశంలో 99.99శాతం కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.

దేశంలో 21 కోట్ల 44 లక్షల 91 వేల 777 కుటుంబాలు ఉంటే వాటిలో 21 కోట్ల 44 లక్షల 73 వేల 43 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది.

18,734 (0.01%) ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు లేవు. వీటికి కూడా 2022 నాటికి విద్యుత్ సౌకర్యం వస్తుందని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)