వరదల ఉపద్రవం నుంచి కేరళ పాఠాలు నేర్చుకుందా,,లేదా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: 2018 వరదల ఉపద్రవం నుంచి కేరళ పాఠాలు నేర్చుకుందా, లేదా?

  • 16 జూలై 2019

గత ఏడాది పోటెత్తిన వరదలు కేరళను కన్నీటి సంద్రంగా మార్చాయి. దాదాపు 350 మంది చనిపోగా మరెందరో సర్వం పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు.

సమస్యకు కారణం రాష్ట్రంలోని 44 నదులపై కట్టిన డ్యాములేనని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ డ్యాములు ఏ క్షణంలోనైనా కూలొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరి నాడు వరదల్లో అన్నీ పోగొట్టుకుని వీధిన పడిన వారి జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి కేరళ నుంచి అందిస్తున్న కథనం ఇది.

నిరుడు ముంచెత్తిన భయానక వరదలు కేరళకు కీలకమైన పర్యాటక, వ్యవసాయ రంగాలను చిన్నాభిన్నం చేశాయి.

ప్రభుత్వం డ్యాములను, జలాశయాలను సరిగా నిర్వహించలేక పోవడమే ఈ భారీ వరదలకు ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఆనకట్టల నిర్వహణ పట్ల మరింత శ్రద్ధ వహించి సమయానుసార చర్యలు చేపట్టి ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇపుడు అంగీకరిస్తున్నారు.

కేరళ ప్రభుత్వ ప్రతినిధి, శాసనకర్త సాజీ చెరియన్ బీబీసీతో మాట్లాడుతూ- "చెరోంతని, ముల్లపెరియార్ డ్యాములు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. వాటి నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. ఈ విషయంలో కేరళ, తమిళనాడు ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది" అని చెప్పారు.

2018 వరదలు సంభవించినప్పటి నుంచి కేరళ ప్రభుత్వ నీటి నిర్వహణ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాటి వరదల నుంచి ప్రభుత్వం పెద్దగా పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. మరి ఈ వానా కాలాన్ని కేరళ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)