బిహార్ వరదల్లో మునగడానికి భారత్, నేపాల్ మధ్య గొడవలే కారణమా?

నీటి వనరుల విషయానికి వస్తే భారత్, నేపాల్‌ల మధ్య సంబంధాలు అంత బాగా ఏమీ ఉండవు. ఇటీవల ముఖ్యంగా వర్షాకాలంలో ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది.
వరదలు ఇరుగుపొరుగు మధ్య ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. రెండు వైపులా ఆగ్రహంతో ఉన్న నివాసితులు తమ బాధలకు కారణం సరిహద్దులో ఉన్నవారినేనని నిందిస్తున్నారు.
వరదల కారణంగా నేపాల్, బంగ్లాదేశ్‌లలో పదులు సంఖ్యలో ప్రజలు మరణించారు. ఉత్తర, ఈశాన్య భారత్‌లో మూడు కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
భారత్, నేపాల్‌లు దాదాపు 1,800 కిలోమీటర్ల మేరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. నేపాల్ నుంచి దిగువన ఉన్న భారత్ వైపు దాదాపు 6 వేల వరకు నదులు, కాలువులు ప్రవహిస్తున్నాయి. ఎండాకాలంలో గంగానది ప్రవాహంలో 70 శాతం నీరు ఇక్కడి నుంచే చేరుతుంది. కానీ, ఎప్పుడైతే గంగా నది పొంగిపొర్లుతుందో అప్పుడు నేపాల్, భారత్‌లోని మైదాన ప్రాంతాలు జలమయమైపోతాయి.
సరిహద్దు వెంబడి భారత్ చేపడుతున్న నదీ నిర్మాణాలను నేపాల్ తప్పుపడుతోంది. రెండేళ్ల క్రితం తూర్పు నేపాల్‌లో బీబీసీ పర్యటించినప్పుడు భారత్‌వైపు నిర్మాణాలు కనిపించాయి.
- లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ‘బిగ్ బాస్’
- ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టు ఇదే, టీమిండియా నుంచి ఇద్దరికి చోటు
2016లో ఈ ప్రాంతంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సరిహద్దుకు ఇరువైపుల స్థానికులు ఘర్షణ పడ్డారు.
ఇలాంటి దాదాపు 10 నిర్మాణాలు నేపాల్‌లోని వేలాది హెక్టార్ల భూమిని ముంచెత్తుతున్నాయని నేపాలీ అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ నిర్మాణాలను భారతీయ అధికారులు రోడ్లుగా చెబుతున్నారు. కానీ, నేపాల్ నిపుణులు మాత్రం భారత సరిహద్దు గ్రామాలను వరదలు నుంచి రక్షించే కట్టడాలుగా ఆ నిర్మాణాలని చెబుతున్నారు.
దక్షిణ నేపాల్‌లోని రౌతాహాట్ జిల్లా ప్రధాన కార్యాలయం గౌర్ దాదాపు పది రోజులపాటు నీటిలో మునిగిపోయింది.
ఇక్కడ జరిగిన ఘర్షణలకు అధికారులు భయపడ్డారు.
"చాలా భయాందోళనల తరువాత, భారత గట్టు కింద ఉన్న రెండు ద్వారాలను తెరిచారు. ఇది మాకెంతో సహాయపడింది'' అని నేపాల్ సాయుధ పోలీసు దళాల సూపరింటెండెంట్ కృష్ణ ధకల్ బీబీసీకి చెప్పారు.
అయితే, దీనిపై సమాధానం ఇవ్వడానికి భారత అధికారులు నిరాకరించారు.
ఇరుదేశాలు కొన్నాళ్లుగా ఈ అంశంపై సమావేశాలు నిర్వహిస్తున్నాయి, కానీ పెద్దగా మార్పురాలేదు.
సరిహద్దులో నీటి నిర్వహణపై మేలో నేపాల్, భారత అధికారుల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నదీ సరిహద్దు వెంట రోడ్లు ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ సమస్యను దౌత్యమార్గాల ద్వారా మాత్రమే చర్చించాలని నిర్ణయించారు.
- యూరప్, అమెరికాలో ఆశ్రయం కోసం ప్రజలు ఎందుకు వెళుతున్నారు?
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
అయితే, భారత్‌తో వస్తున్న సమస్యలను నేపాలీ సంధానకర్తలు, దౌత్యవేత్తలు ఆ దేశ అధికారులతో సమర్థవంతంగా లేవనెత్తలేక పోవడంపై స్వదేశంలో విమర్శలు ఎదుర్కొన్నారు.
కానీ, భారత ప్రజలు కూడా వరదలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈశాన్య రాష్ట్రమైన ఒక్క బిహార్‌లోని దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయాల్సి వచ్చింది.
గంగా ఉపనదులు కోసి, గండకి వంటి నదులు పొంగిపొర్లడం వల్ల నేపాల్ వైపు ఉన్న వరద గేట్లను తెరవడంతో దిగువన ఉన్న బిహార్ తీవ్రంగా దెబ్బతింటుంది.
కానీ, వాస్తవానికి నేపాల్ సరిహద్దులో ఈ రెండు నదుల మధ్య బ్యారేజీలు ఉన్నప్పటికీ వాటిని భారత ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది.
1954, 1959లో కోసి, గండక్ ఒప్పందంపై ఇరు దేశాల సంతకం చేయడంతో భారత ప్రభుత్వమే ఈ బ్యారేజీలను పర్యవేక్షిస్తోంది.
ప్రధానంగా వరద నియంత్రణ, నీటిపారుదల, జలవిద్యుత్ ఉత్పత్తి కోసం భారత్ ఈ బ్యారేజీలను నిర్మించింది.
కానీ, నేపాల్‌కు ఏమాత్రం ఉపయోగంగా లేకపోవడంతో ఈ బ్యారేజీలు అక్కడ వివాదాస్పదమయ్యాయి.
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
బిహార్ దుఃఖదాయినిగా పేరున్న కోసీ నది వరదల వల్ల 2008లో వేలాదిమంది చనిపోయారు. నేపాల్, భారత్‌లో లక్షల మందిపై ప్రభావం పడింది.
నేపాల్‌లో అనేక నదులు పెళుసైన జీవావరణాన్ని కలిగిన చ్యుర్ పర్వత శ్రేణి గుండా ప్రవహిస్తున్నాయి. వీటి వల్ల తీవ్రంగా ముప్పు పొంచి ఉంది.
నదీప్రవాహలకు అడ్డుకట్టవేయడంలో, ముప్పును తగ్గించడంలో గతంలో ఈ కొండలు చాలా సహాయపడేవి. కానీ, నేపాల్, భారత్ ఈ కొండలపై మైనింగ్ చేపట్టడం, చెట్లను కొట్టివేయడంతో ఈ కొండలే ప్రమాదకరంగా మారాయి.
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- భారతదేశ వాతావరణం: ఒకవైపు వరదలు, మరోవైపు కరవు...
ఇలాంటి కొండలు తమ స్వభావాన్ని కోల్పోతుండటంతో వరదలను సహజంగా అడ్డుకోలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.
ఇక్కడి సహజవనరుల పరిరక్షణకు కొన్నేళ్ల కిందట ఒక ఉన్నత స్థాయి పరిరక్షణ ప్రచారం ప్రారంభించారు. కానీ అది విఫలమైంది. మరోవైపు సహజ వనరులను దోచుకోవడం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది.
ఈ ప్రాంత జీవావరణం నేపాల్‌లోని అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సారవంతమైన భూముల భవిష్యత్తు కోసం మాత్రమే కాదు భారత్‌లోని ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు కూడా కీలకమైంది. మైనింగ్, అటవీ నిర్మూలనను నియంత్రించడంలో విఫలమవుతోందని
భారత్ నుంచి నేపాల్ విమర్శలు ఎదర్కొంటూనే ఉంది.
ఇప్పుడు, వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాలు అస్థిరంగా ఉండటంతో ఇరు దేశాల మధ్య సమస్యలు చాలా క్లిష్టంగా మారుతున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐసీసీ సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే గెలిచే జట్టు ఏది?
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చారు.. భారత్‌లో బాద్‌షాలయ్యారు
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- ఇక్కడ ఉండేవారు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)