కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... 12 మంది మృతి
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: ముంబయిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... 12 మంది మృతి

  • 17 జూలై 2019

ముంబయిలోని డోంగ్రీ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల బిల్డింగ్ మంగళవారం ఉదయం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు సహా 12 మంది చనిపోయారని డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ (DMCR) అధికారికంగా ప్రకటించింది.

మరో ఎనిమిది మంది జేజే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురు మహిళలు. హబీబ్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఏడాదిన్నర వయసున్న బాలుడు క్షేమంగా డిశ్చార్జి అయ్యాడు.

శిథిలాల మధ్య 30 మందికి పైగా చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు.

భవనం కూలడం వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, వందేళ్ల కాలం నాటి ఈ పురాతన భవనం తాజాగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిని ఉంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)