అమర్‌నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: అమర్‌నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక

  • 20 జూలై 2019

అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ గుహ తీర్థయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది.

కానీ.. ఆ ప్రయాణం అంతే ప్రమాదకరమైనది కూడా. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఎంతో శ్రమకోర్చి పర్వతాలను అధిరోహించాలి.

చాలా మందికి పర్వతాలను అధిరోహించే శక్తి ఉండదు. అప్పుడు స్థానిక ముస్లింలు రంగంలోకి దిగుతారు. ఈ తీర్థయాత్రకు వెన్నెముకగా నిలుస్తారు.

‘‘ఇక్కడ రెండు మతాల వారూ కలిసి పనిచేస్తారు. అది చాలా అందమైన విషయం. యాత్రికుల సంరక్షణను స్థానికులు చూసుకుంటారు. వారి అవసరాలను తీరుస్తారు. యాత్రికులు కూడా వీరితో చక్కగా కలిసిపోతారు. అన్నిచోట్లా ఇలాగే జరగాలి’’ అంటారు గౌరవ్ అనే తీర్థయాత్రికుడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)