ముంబయి ఎంటీఎన్ఎల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, చిక్కుకున్న 100 మంది

  • 22 జూలై 2019
అగ్ని ప్రమాదం Image copyright ANI

ముంబయిలోని ఎంటీఎన్ఎల్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 100 మంది భవనం పైభాగంలో చిక్కుకున్నారు.

ఇప్పటి వరకూ 60 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇంకా 30 నుంచి 35 మంది భవనంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

సహాయక చర్యల్లో పాల్గొంటున్న అగ్నిమాపక శాఖ ఉద్యోగి ఒకరికి ఊపిరాడక ఇబ్బంది పడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

బాంద్రా ప్రాంతంలో ఉన్న టెలీఫోన్ ఎక్స్ఛేంజ్ భవనంలోని నాలుగో అంతస్తులో సోమవారం మధ్నాహ్నం మంటలు చెలరేగాయి. ఇది లెవల్ 4 ప్రమాదమని అధికారులు తెలిపారు.

భవనంలో చిక్కుకున్న ప్రజలను బయటకు పంపిస్తున్నారు.

ఘటనా స్థలికి 14 ఫైర్ ఇంజన్‌లు చేరుకుని, మంటలను అదుపుచేసే పనిలో ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందికి 3 గంటలు పట్టిందని అధికారులు తెలిపారు.

Image copyright ANIL

9 అంతస్తుల ఈ భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లలో విద్యుత్ పరికరాలు, వైరింగ్, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు ఈ మంటల్లో ఆహుతయ్యాయి.

ఇంతవరకూ ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Image copyright ANI

మధ్యాహ్నం 3.09 గంటలకు తమకు ప్రమాదానికి సంబంధించిన ఫోన్ వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు