కోలివింగ్‌: ఇంటికి భారత యువత కొత్త నిర్వచనం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కోలివింగ్‌: ఇంటికి భారత యువత కొత్త నిర్వచనం

  • 27 జూలై 2019

భారత యువత ముఖ్యంగా 1981 నుంచి 96 మధ్య పుట్టినవాళ్లు 'ఇల్లు' అనే భావనకు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. అదే 'కోలివింగ్'.

ఈ జీవనంలో- పరిచయమే లేనివాళ్లు ఒకచోట అద్దెకు ఉంటూ, తమ వంటగదిని, పడకగదులను పంచుకుంటారు. 'కోలివింగ్ స్పేసెస్‌'లో పార్టీలు లాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి ఈ సదుపాయాన్ని కల్పించే సంస్థలు.

2022 నాటికి దేశంలో కోలివింగ్ స్పేసెస్ వ్యాపారం దాదాపు 14 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.

'కోలివింగ్‌'పై బెంగళూరు నుంచి బీబీసీ ప్రతినిధి జో థామస్ అందిస్తున్న కథనం ఇది.

'కోలివింగ్'ను ఫ్లాట్ షేరింగ్ కాన్సెప్ట్‌కు తర్వాతి స్థాయిగా చెప్పుకోవచ్చు. ఈ జీవనంలో చాలా వెసులుబాటు ఉంటుంది.

కనీసం ఆరు రోజుల నుంచి నెలలపాటు ఈ స్పేసెస్‌లో నివాసం ఉండొచ్చు. ఉద్యోగ రీత్యా తరచూ నగరాలు మారే యువతకు ఇది అనువుగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)