వీడియో: ‘ఆ ఫోన్ నెంబర్ సన్నీ లియోనిది కాదు.. నాది’ అంటున్న 26 ఏళ్ల యువకుడు

సన్నీలియోని అనుకుని అంతా ఆ 26 ఏళ్ల యువకుడికి ఫోన్లు చేస్తున్నారు. కారణం.. ఓ బాలీవుడ్ సినిమాలో ఆయన ఫోన్ నంబరును సన్నీలియోని ఫోన్ నంబరుగా చెప్పడమే. దీంతో సన్నీ అభిమానులు ఆ నంబరు నిజంగా ఆమెదే అనుకుంటూ తెగ కాల్ చేస్తున్నారు. విపరీతంగా వస్తున్న ఫోన్ కాల్స్ వల్ల ఇబ్బందిపడుతున్నానంటున్నారాయన.

అర్జున్ పాటియాలా అనే బాలీవుడ్ సినిమాలో సన్నీలియోని తాను పోషించిన పాత్రకు సంబంధించిన ఫోన్ నంబరును బయటకు చదువుతుంది. అయితే, ఆ నంబర్ పునీత్ అగర్వాల్ అనే 26 ఏళ్ల యువకుడిది.

ఈ సినిమా విడుదలైన జులై 26వ తేదీ నుంచి ప్రతిరోజూ కనీసం 100 మందికిపైగా తనకు ఫోన్ చేస్తున్నారని.. రాత్రుళ్లు నిద్రపోనివ్వడం లేదని, వేకువజామున 4 గంటల వరకు ఫోన్ మోగుతూనే ఉంటోందని పునీత్ చెబుతున్నారు.

ఈ రకంగా రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్లు వస్తుండడంతో ఇబ్బంది పడుతున్న ఆయన దీని బారి నుంచి తప్పించుకోవడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. సినిమాలో తన ఫోన్ నంబరు తొలగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)