కేరళ వరదలు: ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: కేరళ వరదలు.. ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’

  • 11 ఆగస్టు 2019

రిపోర్టర్: దీప్తి బత్తిని, షూట్ ఎడిట్: నవీన్ కుమార్ కె

బీబీసీ ప్రతినిధులు

భారీ వరదల విధ్వంసాన్ని చవిచూసి ఏడాది గడిచిందో లేదో, కేరళలో మళ్లీ జల ప్రళయం వచ్చింది. ఉత్తర కేరళ - కోజికోడ్, వాయనాడ్, మలప్పుఱం ప్రాంతాలు దారుణంగా వరదల బారిన పడ్డాయి. శనివారం సాయంత్రం నాటికి 57 మంది వరదల వల్ల మరణించగా, వారిలో 19 మంది మలప్పుఱం ప్రాంతానికి చెందినవారే.

జిల్లా కంట్రోల్ రూమ్ వివరాల ప్రకారం ఎక్కువ మరణాలు కొండ చరియలు విరిగిపడడం (ల్యాండ్ స్లైడ్స్) వల్లే జరిగాయి. గత రెండు రోజుల్లో ఎనిమిది జిల్లాల్లో మొత్తం 80 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాకు ప్రకటించారు. మలప్పుఱం, కవలప్పర, మెప్పాడి, వాయనాడ్‌లలో ఎక్కువ ఘటనలు జరిగాయి.

ఋతుపవనాలు, వర్షపాతం మారుతుండడంతో కేరళ ప్రజలు బాధలు పడుతున్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)