శ్రీనగర్‌లో కర్ఫ్యూపై ప్రభుత్వం మాటేంటి? పోలీసులు ఏం చెప్పారు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కశ్మీర్: శ్రీనగర్‌లో కర్ఫ్యూ పరిస్థితి ఎలా ఉంది... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  • 12 ఆగస్టు 2019

జమ్మూకశ్మీర్ వేసవికాల రాజధాని శ్రీనగర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి... కశ్మీర్ నుంచి బీబీసీ ప్రతినిధి యోగితా లిమయే అందిస్తున్న వీడియో కథనం ఇది.

ఆగస్టు 11న ఆదివారం ఈ వీడియోను తీశారు. కశ్మీర్‌‌లో టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం స్తంభింపజేసినందున రిపోర్టర్ అక్కడి నుంచి సోమవారం(ఆగస్టు 12) దీనిని పంపించారు.

శ్రీనగర్‌లో గత రెండు రోజులపాటు సడలించిన కర్ఫ్యూ ఆంక్షలు ఆదివారం తిరిగి అమల్లోకి వచ్చాయి. గత రెండు రోజుల కన్నా వీధుల్లో తక్కువ జనం, తక్కువ వాహనాలు కనిపించాయి. ఈ చర్య ఎందుకు చేపట్టారనే స్పష్టత లేదు.

ఈ అంశం గురించి బీబీసీ ఒక ప్రభుత్వ అధికార ప్రతినిధిని అడగ్గా- ఆయన కర్ఫ్యూ లేదని చెప్పారు. ఎక్కడా నలుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడరాదనే నిబంధనలు మాత్రమే ఉన్నాయన్నారు.

శ్రీనగర్‌లో పోలీసు వ్యాన్లు తిరుగుతున్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉందని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు చెప్పారు. ఇలా కర్ఫ్యూపై రెండు రకాల సమాచారం వచ్చింది.

ఫోన్, ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం దాదాపు వారం రోజులుగా నిలిపివేసింది. ప్రజలు ఒకరితో మరొకరు సమాచారం పంచుకోలేకపోతున్నారు.

ఆగస్టు 5న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్‌ అస్థిరంగా, ఉద్రిక్తంగా ఉంటోంది.

ఆగస్టు 9న శుక్రవారం శ్రీనగర్‌లో నిరసన ప్రదర్శన జరిగింది. ఇందులో వేల మంది పాల్గొన్నారు. దీనిని బీబీసీ బృందం వీడియో తీసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక శ్రీనగర్ సౌరా ప్రాంతంలో శుక్రవారం (ఆగస్టు 9) ప్రార్థనల అనంతరం జరిగిన నిరసన ప్రదర్శన

నిరసనకారులు సురక్షిత ప్రదేశానికి పరుగులు పెడుతుండటం ఆ వీడియోలో చూడొచ్చు. గన్‌షాట్ల శబ్దాలు వినొచ్చు. ఈ ప్రదర్శనలో నిరసనకారులకు గాయాలయ్యాయనే సమాచారం వస్తోంది. కోపంతో ఉన్న స్థానికులు లేదా భద్రతా సిబ్బంది మమ్మల్ని దారిలో అడ్డుకోవడంతో దీనిని నిర్ధరించుకొనేందుకు మేం ఆస్పత్రికి వెళ్లలేకపోయాం.

ఈ సమాచారం విషయమై మేం ఒక ప్రభుత్వ అధికార ప్రతినిధిని అడిగాం. "ఆస్పత్రిలో ఎవరైనా చనిపోయారా" అని అడగ్గా, కాల్పులు జరగలేదనీ, ఒక్క గన్ షాట్ కూడా పేల్చలేదనీ పోలీసులు నిన్ననే (అంటే ఆగస్టు 10 శనివారం) వివరంగా ప్రకటన చేశారని ఆయన బదులిచ్చారు.

ఆయన ఇచ్చిన సమాధానంలో అంత స్పష్టత లేదు.

20 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొన్న నిరసన ఏదీ శ్రీనగర్‌లో జరగలేదని కేంద్ర హోంశాఖ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)