కేరళ వరదలు: ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎలా బతకాలి... ఎక్కడికి పోవాలి?'

  • 19 ఆగస్టు 2019

కేరళ వరదల్లో విషాద గాథలెన్నో. వీటిలో ఒకటి పద్మిని గాథ. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆమె భర్త, సోదరి సహా ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయారు.

వీరిలో ఐదుగురి మృతదేహాలు దొరికాయి. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మసీదులోనే పోస్టుమార్టం చేశారు.

పద్మిని కుటుంబంలోని ఇతర మహిళలూ జరిగిన నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు.

"గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఇంత విధ్వంసం లేదు. కొన్ని మరమ్మతులు చేయించుకోవాల్సి వచ్చింది అంతే. ఈ సంవత్సరం కూడా వర్షాలు చివరికి తగ్గుతాయని మేం భావించాం. మేం ఏదైనా చేయకముందే మా ఇళ్లను, కుటుంబాన్ని కోల్పోయాం" అని పద్మిని చెప్పారు.

ప్రభుత్వాలు సహాయ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ పద్మిని లాంటి బాధితుల కుటుంబాలు ఇకపై మామూలుగా ఉండడం చాలా కష్టం.

"తరువాత ఏం చేయాలో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు. నేను నా ఇంటిని కూడా కోల్పోయాను" అని ఆమె చెప్పారు.

కుటుంబంలోని మగవారంతా ఘటనా స్థలంలో మృతదేహాల కోసం వేచి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)