కశ్మీర్: ఆర్టికల్ 370 పిటిషన్ల విచారణకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం... అక్కడికి వెళ్ళేందుకు సీతారాం ఏచూరికి అనుమతి

  • 28 ఆగస్టు 2019
సుప్రీం కోర్టు Image copyright Getty Images

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఇంటర్నెట్, టెలిఫోన్ వంటి సమాచార వ్యవస్థలపై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు బుధవారం నాడు ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైనదేనా అని ప్రశ్నిస్తూ దాఖలైన అనేక పిటిషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందున్నాయి.

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది. ఒక పిటిషనర్‌ను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి, ఇది అత్యంత బాధ్యతతో పరిశీలించవలసిన కేసు అని దయచేసి అర్థం చేసుకోండని వ్యాఖ్యానించారు.

పిటిషనర్లలో ఒకరైన మహమ్మద్ అలీం సయ్యద్‌ తన తల్లితండ్రులను కలుసుకోవడానికి అనంతనాగ్‌కు వెళ్ళవచ్చని ప్రధాన న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారు.

అంతేకాకుండా, పోలీసు రక్షణ కూడా కల్పించాలని జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అనుమతించాలని ఈ పిటిషన్ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

అలాగే, సీపీఐ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరిని కూడా జమ్మూకశ్మీర్‌కు వెళ్ళడానికి కోర్టు అనుమతించింది. అక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి పార్టీకి చెందిన నేతను కలుసుకోవచ్చని తెలిపింది. సదరు నేత పోలీసుల నిర్బంధంలో ఉన్నారనే ఆరోపణలున్నాయి.

"మీరు వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాం. మీరు మీ పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆ పని మీదే వెళ్లండి. వేరే ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దు" అని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. రాజకీయ కార్యక్రమాల కోసం కాకుండా ఒక స్నేహితుడిని కలుసుకోవడానికి మాత్రమే ఆయన వెళ్ళాలని సుప్రీం స్పష్టం చేసింది.

కేంద్రానికి, మరి కొంతమందికి నోటీసు ఇచ్చిన సుప్రీం కోర్టు ఈ వ్యవహారాన్ని అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మానసనం విచారిస్తుందని తెలిపింది.

ఆర్టికల్ 370 రద్దుకు సంబధించిన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ మొదలవుతుందని వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

రాయల్‌ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..

#100WOMEN: ‘మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది’

బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

గోదావరిలోంచి బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్