ప్రమాదంలో కొల్లేరు సరస్సు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: కొల్లేరు.. దేశంలో అతి పెద్ద‌ మంచినీటి స‌ర‌స్సుకు వచ్చిన ప్రమాదం ఏమిటి?

  • 4 సెప్టెంబర్ 2019

భారతదేశంలో అతిపెద్ద మంచినీటి స‌రస్సుగా పేరున్న కొల్లేరు భ‌విత‌వ్యం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతే ఎలాంటి చిక్కులు వ‌స్తాయ‌న్న‌ది కొల్లేరు చాటుతోంది.

ప్ర‌క్షాళ‌న పేరుతో చేసిన ప్ర‌య‌త్నాలు స‌జావుగా సాగ‌క‌పోతే స‌మ‌స్య‌లు ఎలా తీవ్ర‌మ‌వుతాయ‌న్న‌ది తెలియ‌జేస్తోంది.

ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా జిల్లాల ప‌రిధిలో కొల్లేరు స‌ర‌స్సు ఉంది. కేజీ(కృషా,గోదావరి) బేసిన్ ప‌రిధిలోని చిత్త‌డి నేల‌ల్లో సుమారుగా 1.20 ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది.

అరుదైన జాతుల‌ ప‌క్షులు, ప‌లు ర‌కాల చేప‌ల‌కు కొల్లేరు ప్రసిద్ధి. ఎన్నో అరుదైన విదేశీ ప‌క్షుల‌కు కొల్లేరు ఆవాసంగా ఉంటోంది. దీని ప‌రిధిలో 29 లంక గ్రామాల్లో మూడు ల‌క్ష‌ల మంది నివిస్తున్నారు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆకివీడు, నిడ‌మ‌ర్రు, భీమ‌డోలు, ఉంగ‌టూరు, పెద‌పాడు, ఏలూరు, దెందులూరు మండ‌లాల‌ ప‌రిధిలో 20 బెడ్ గ్రామాలు ( స‌ర‌స్సులోప‌ల‌), 63 బెల్ట్ గ్రామాలు (స‌ర‌స్సు ఆనుకుని) ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కైక‌లూరు, మండ‌విల్లి మండ‌లాల ప‌రిధిలోని 26 బెడ్, 13 బెల్ట్ గ్రామాలు కొల్లేరు పరిధిలో విస్త‌రించి ఉన్నాయి.

బుడ‌మేరు, త‌మ్మిలేరు, రామిలేరు, గుండేరు లాంటి చిన్నా, పెద్దా ఏరుల నుంచి కొల్లేరుకు నీరు వ‌చ్చి చేరుతుంది. ఏలూరు, కైక‌లూరుకు చెందిన మురుగు నీరు కూడా కొల్లేరులోకి వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)