కమలాత్తాళ్: "ఒక్క రూపాయికే ఇడ్లీ.. నేను చనిపోయే దాకా అమ్ముతా.. ఎప్పటికీ ధర పెంచను"

  • 4 సెప్టెంబర్ 2019
కమలాతాల్

ఈ రోజుల్లో రూపాయి పెడితే ఏం వస్తుంది? కానీ, తమిళనాడులోని కోయంబత్తూర్‌ సమీపంలో ఉన్న వడివేలంపాలయం గ్రామానికి చెందిన 80 ఏళ్ల కమలాత్తాళ్ ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నారు.

"ఇప్పుడు మనం 2019లో ఉన్నాం. ఇప్పటికీ మా ఊరిలో రూపాయికే ఇడ్లీ దొరుకుతోంది. 10 రూపాయలతో కడుపునిండా తినొచ్చు. కొన్నిసార్లు మా దగ్గర డబ్బులు లేకున్నా ఆ బామ్మ ఏమీ అనరు. నా జేబులో రూ.500 ఉన్నా సరే, ఇక్కడే ఇడ్లీ తింటాను" అన్నారు వడివెలంపాలయం గ్రామానికి చెందిన రామసామీ.

"రోజూ పొద్దున 5.30 గంటలకు నిద్రలేస్తాను. చట్నీ, సాంబార్ చేస్తా. 6 గంటలకల్లా పొయ్యి వెలిగిస్తా. మధ్యాహ్నం 12 దాకా ఇడ్లీలు అమ్ముతా. బియ్యం, పప్పు, కొబ్బరి, నూనె, ఇతర సామగ్రికి రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు పోను రోజూ రూ.200 మిగులుతాయి" అని కమలాత్తాళ్ చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: నేను చనిపోయే దాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతా. ఎప్పటికీ ధర పెంచను

ఈ బామ్మ చేసే ఇడ్లీలు, చట్నీ, సాంబార్ కూడా భలే రుచికరంగా ఉంటాయని రామసామీ అంటున్నారు.

ఈ వయసులోనూ బామ్మ రుబ్బురోలును వాడుతున్నారు. తాను ఇప్పటికీ ఇంత బలంగా ఉండటానికి కారణం తన ఆహార అలవాట్లేనని ఆమె అంటున్నారు.

"నేను రాగి జావ తాగేదాన్ని. అలాంటి ఆహారం తినడం వల్లే నేను ఇప్పటికీ పనిచేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎక్కువగా అన్నం తింటున్నారు. కానీ, బియ్యంలో సరైన పోషకాలు ఉండవు" అని ఆమె అన్నారు.

సాధారణంగా తమిళనాడులో ఒక ఇడ్లీ ఖరీదు రూ.5 నుంచి రూ.20 ఉంటుంది. కానీ, ఈ బామ్మ ఒక్క రూపాయికే ఇడ్లీ ఇవ్వడం అందరినీ ఆలోచించపజేస్తోంది.

"మా ఊరి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. అక్కడ ఉండే హోటళ్లలో ఒక్క దోశ తింటే 15 రూపాయలు అవుతాయి. అది తిన్న గంటలోపే మళ్లీ ఆకలేస్తుంది. అవే డబ్బులతో ఇక్కడ ఇడ్లీ కడుపునిండా తొనొచ్చు. మధ్యాహ్నం దాకా ఆకలి బాధే ఉండదు" మరో గ్రామస్థుడు సెల్వ సుందరం వివరించారు.

"నేను చనిపోయే దాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతా. ఎప్పటికీ ధర పెంచను" అంటున్నారు ఈ బామ్మ.

ఇవి కూడా చదవండి:

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 98 ఏళ్ల బామ్మ యోగా ఎలా చేస్తున్నారో చూశారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్: ‘మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి’ - మొహమ్మద్ సత్తార్ ఖాన్‌కు యూఐడీఏఐ నోటీసు

ఆర్మీలో మహిళాధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులన్న సుప్రీం కోర్టు తీర్పుతో జరిగేదేంటి

టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు

ఐఫోన్లకు కరోనా వైరస్ దెబ్బ.. ఉత్పత్తి, అమ్మకాలు, ఆదాయంపై ప్రభావం పడిందన్న ఆపిల్

పంటకు నష్టం చేసిన కలుపుమందు.. బేయర్ సంస్థకు రూ. 1,890 కోట్ల జరిమానా విధించిన కోర్టు

కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది